నీళ్ల బకెట్‌లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

 • సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన
షాపూర్ నగర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 23: 

మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీళ్లతో నిండిన బకెట్‌లో పడి ఏడాదిన్నర వయస్సు గల చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. చిన్నారి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. చిన్నారి అక్క చాందిని (10) వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి నీళ్లతో నిండిన బకెట్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న సూరారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More