– విధుల నుంచి తొలగిస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ ఉత్తర్వులు
– అక్రమ వసూళ్లు, బాధ్యతారాహిత్యమే కారణం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మార్చి 24: జిహెచ్ఎంసి పట్టణ ప్రణాళిక విభాగంలో అంతా తామై వ్యవహరించిన న్యాక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్) ఇంజనీర్ల కథ ముగిసినట్లేనా…? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. న్యాక్ లో శిక్షణ పొందిన వారు జిహెచ్ఎంసి పట్టణ ప్రణాళిక విభాగంలో విధులు నిర్వహించేవారు. దీంతో అంతా తామై ఆయా సర్కిల్ల పరిధిలో నిర్మాణ అనుమతుల కోసం స్థల పరిశీలన, వాటి మంజూరు, అక్రమ నిర్మాణాల గుర్తింపుతో పాటు పట్టణ ప్రణాళిక విభాగంలో నిర్వహించే ప్రతి పనిలో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో అంతే స్థాయిలో అక్రమ సంపాదనకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా విధుల్లో బాధ్యతారాహిత్యం, సంస్థకు చెడ్డ పేరు తెస్తున్నారనే ఆరోపణలపై అందిన సమాచారం మేరకు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న మొత్తం 27 మంది న్యాక్ ఇంజనీర్లను విధుల నుంచి తొలగిస్తూ జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబరితి ఉత్తర్వులు జారీ చేశారు. వారి వద్ద నుంచి కార్యాలయానికి సంబంధించిన పత్రాలను, ఎలక్ట్రానిక్ పరికరాలను, సిమ్ కార్డులతో పాటు ఇతరత్రా వస్తువులను స్వాధీనం స్వాధీనం చేసుకోవాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిలో భాగంగా కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఉన్న 5 మంది న్యాక్ ఇంజనీర్లను తొలగించారు. వీరిలో కుత్బుల్లాపూర్ సర్కిల్ కు చెందిన దాసరి వెంకటేష్, గోపతి జయశ్రీ ఉన్నారు. అలాగే గాజులరామారం సర్కిల్ కు చెందిన జస్వంత్, వైనాల సాయిరాం, పున్నం చందు ఉన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.