పద్మా నగర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జనవరి 26:
దేశం గణతంత్ర రాజ్యంగా అవతరించి 77 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పద్మా నగర్ డివిజన్‌లోని పద్మా నగర్ ఫేజ్ -2 సర్కిల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సంక్షేమ సంఘం సభ్యులు, కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు.

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన సంక్షేమ సంఘం సభ్యులు

ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య బలాన్ని గురించి పలువురు వివరించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. అనంతరం పద్మా నగర్ ఫేజ్ -2 కాలనీ కి సంబంధించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను వారు ఆవిష్కరించారు.

గణతంత్ర దినోత్సవం లో పాల్గొన్న కాలనీవాసులు

ఈ కార్యక్రమంలో శ్రీ గంగా లలితా కామేశ్వరి సహిత సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మురళి, సంక్షేమ సంఘ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, సభ్యులు బుచ్చిరెడ్డి, సంజీవ్ కుమార్, మురళి, కృష్ణమ నాయుడు, భాస్కర్ గౌడ్, నాగేశ్వరరావు, గణేష్, బ్రహ్మచారి, సాయా గౌడ్,  కాలనీ వాసులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More