పద్మా నగర్ లో ఘనంగా చండీ హోమం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 28: దేవీ నవరాత్రుల్లో భాగంగా కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి పద్మా నగర్ ఫేజ్ -2 రింగ్ రోడ్డులో సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం వద్ద శ్రీ చండీ హోమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు.

పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చండీ పఠనం, హవన క్రతువులు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ప్రజలంతా శాంతి, సుభిక్షం, ఆరోగ్య శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులు దుర్గాదేవి వివిధ రూపాలను ధ్యానిస్తూ అమ్మవారిని ప్రార్థించారు.

నవరాత్రుల సమయంలో నిర్వహించే చండీ హోమం ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుందని, మన సంప్రదాయాలు, ఆచారాలు యువతకు సత్ప్రేరణ కలిగిస్తాయని బిఆర్ఎస్ డివిజన్, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్ పేర్కొన్నారు. వందలాది మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన స్థానికులు, వలంటీర్లు, భక్తులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్, శ్రీనివాస్ జైన్, సంజీవ్, వీరేష్, గణేష్, మాధవ్, కృష్ణ ప్రసాద్, నాగ, నరసింహ, బ్రహ్మచారి, శ్రావణ్ కుమార్, రాము, రాజేశ్వర్ రెడ్డి, ఆనందం, దేవరకొండ శోభారాణి, రాజేశ్వరి, స్వప్న, జ్యోతి, సంగీత దీపిక, భార్గవి, లక్ష్మి, శోభ, దుర్గ, మాధురి, స్వాతి, శ్రీలత, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.