యండమూరి లేఅవుట్ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గం ఏర్పాటు
గాజులరామారం (న్యూస్ విధాత్రి), మే 18: గాజులరామారం సర్కిల్ లోని మహదేవపురం డివిజన్ పరిధి యండమూరి లేఅవుట్ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని కాలనీ వాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ ఎన్నిక కోసం నిర్వహించిన సమావేశంలో అధ్యక్షుడిగా గీద సుమన్ రెడ్డి, చైర్మన్గా వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్గా మల్లేశం ఎన్నికయ్యారు. అదేవిధంగా కోశాధికారి అకెళ్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రవి, సజన్ ఎంపికయ్యారు. సలహాదారులుగా శివానంద్ మాడపాటి, వీరబాబు, అంజి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చందు, రమేష్ రెడ్డి, అప్పారావు, కృష్ణ యాదవ్ నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గోవింద్, భీమా రెడ్డి, కంచి రవి, శ్రీకాంత్ రెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు, పెద్దలు, మాజీ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ కాలనీలోని రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి ప్రధాన సమస్యలను ప్రజాప్రతినిధులులతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాలనీవాసులను సమన్వయ పరుచుకుంటూ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నూతన కార్యవర్గ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు.