సందడిగా బతుకమ్మ సంబరాలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 26: కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో మహిళా పట్టణ సమాఖ్యల (టిఎల్ఎఫ్) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ వి. నరసింహ, సిటీ సివిల్ కోర్టు పిల్లల దత్తత స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది వి. నర్మదా
ముఖ్య అతిథులుగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. టిఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్, మహిళా పొదుపు సంఘాల సభ్యులతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, సర్కిల్ పరిధిలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి మదన్ మోహన్, ఏఎంసీలు ప్రమీల, కృష్ణ, కమ్యూనిటీ ఆర్గనైజర్లు కవిత, జగదీష్, వెంకట్ రెడ్డి, కిషోర్, సూపరింటెండెంట్ గిరిబాబు, టిఎల్ఎఫ్, ఎస్ ఎల్ ఎఫ్, పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
• భాగ్యరధి డిగ్రీ కళాశాలలో…
చింతల్ లోని భాగ్యరధి డిగ్రీ కాలేజీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మను అందంగా అలంకరించి, బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ఆడారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపాల్ నవీన్ రాజ్, డైరెక్టర్ నల్ల జై శంకర్ గౌడ్ పాల్గొని విద్యార్థినులను ప్రోత్సహించారు. అలాగే బోధనా,బోధనేతర సిబ్బంది అందరూ ఈ వేడుకలో భాగమై, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని స్మరించుకున్నారు.