అదానీ, అంబానీల సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తారా..?

  • అందుకే కేసీఆర్‌ ‌రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందన్నారు
  • తాను రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే తానే అంటుపెడ్తాననీ అంబేడ్కరే చెప్పారు
  • తెలంగాణపై బిజెపి కక్షగట్టింది
  • చింతమడక ఎస్సీ డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల గృహా ప్రవేశాల సభలో మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : సిద్ధిపేట రూరల్‌ ‌మండలం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వగ్రామమైన చింతమడకలో 164సామూహిక(డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్లు)గృహా ప్రవేశాలకు గురువారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ఎస్సీ లబ్ధిదారులను గృహా ప్రవేశాలు చేయించారు. గ్రామంలోని దమ్మచెరువు నుంచి నర్లేంగగడ్డ వరకు బిటి రోడ్డు, చింతమడక నుంచి రాఘవాపూర్‌ ‌వయా సింగచెరువు వరకు బిటి రోడ్డు, చింతమడక నుంచి చెల్లాపూర్‌-‌రా•క్కపేట వరకు బిటి రోడ్డు పనులకు మంత్రి హరీష్‌రావు శంకుస్తాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన హక్కులు దక్కాలని సిఎం కేసీఆర్‌ ‌చెప్పారనీ, అదానీ, అంబానీల సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తారా..? అని ప్రశ్నించారు. అందుకే కేసీఆర్‌ ‌రాజ్యాంగం మార్చాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. సిఎం కేసీఆర్‌ ‌రాజ్యాంగంలో కొంత మార్పులు తేవాల్సిన అవసరం ఉందనీ మాట్లాడితే.. కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తూ.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ విమర్శలు చేయడం తగదన్నారు. దేశ వ్యాప్తంగా పేదలకు హక్కులు దక్కడం లేదని, దేశంలోని ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ పరంగా హక్కులు సంక్రమించాలని సిఎం కేసీఆర్‌ ‌కోరినట్లు వెల్లడించారు.

40 కోట్ల మంది దళిత జనాభా కలిగిన దేశంలో కేవలం 12వేల కోట్ల బడ్జెట్‌ ‌పెట్టడం సరికాదనీ కేంద్రం తీరుపై ఆర్థిక మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మి ప్రయివేటు కంపెనీలకు ఇస్తే..రిజర్వేషన్లు ఏలా వర్తిస్తాయనీ, అలా అమ్మితే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్‌ ‌వస్తుందా..?అంటూ రాజ్యాంగ పరంగా ఎస్సీ, ఎస్టీలకు హక్కులు సంక్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పులుల నుంచి మేకల్ని కాపాడాలని అంబేద్కర్‌ ‌తెలిపినట్లు గుర్తు చేస్తూ.. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెరగాలి. ఇప్పుడు ఉన్న రాజ్యాంగం ప్రకారం అది సాధ్యమా..?అంటూ ప్రశ్నించారు. తాను రాసిన రాజ్యాంగం అమలు కాకపోతే నేనే అంటుపెడ్తాననీ.. గతంలోనే అంబేద్కర్‌ ‌చెప్పారని మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. నిజంగా ఇవాళ సిఎం కేసీఆర్‌ ‌సంతోషంగా ఉంటారనీ, చింతమడక గ్రామస్తులంతా ఎంత సంతోషంగా ఉన్నారో.. అదే సంతోషంతో సిఎం కేసీఆర్‌ ఉం‌టారన్నారు. చింతమడక గ్రామం ఐక్యతకు నిదర్శనం. ఈ గ్రామస్తులందరిదీ ఒకే మాట.. ఒకే బాట. ఐక్యత ఉంటే తొందరగా పనులు జరుగుతున్నాయని అనేందుకు నిదర్శనం చింతమడక గ్రామమేననీ అన్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. ఇవాళ చింతమడకలో కట్టిన డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌గృహా ప్రవేశాలలో హాజరై ఇళ్లు చూస్తే కడుపు నిండినంత సంతోషంగా ఉందన్నారు. చింతమడక గ్రామ అభివృద్ధి ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, రైతులకు ఇచ్చే అన్నీ సబ్సిడీలు తగ్గించి రైతులకు భద్రత లేకుండా చేసిందని కేంద్ర బిజెపి తీరుపై మండిపడ్డారు. బడ్జెట్‌లో ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితి తగ్గించడంతో తెలంగాణకు 5వేల కోట్ల రూపాయల కోత పడినట్లు ఆర్థిక మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.

నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ బాయికాడ కరెంటు మీటర్లు పెట్టనని రైతు శ్రేయస్సుకై సిఎం కేసీఆర్‌ ‌చెప్పారని, కానీ బాయికాడ కరెంటు మీటర్లు పెడితేనే 5వేల కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్ర బిజెపి మెలిక పెట్టిందని వివరిస్తూ.. మీటర్లు వద్దు.. బిజెపి వద్దు.. మన కేసీఆరే మనకు ముద్దు అంటూ సభికులచేత అనిపించారు. బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపిందనీ, బట్టేబాజ్‌, ‌జూటే బాజ్‌ ‌పార్టీ బిజెపి అని, బిజెపి చేసే గోబెల్స్ ‌ప్రచారాన్ని తిప్పి కొట్టి, యువత నిజాన్ని, వాస్తవాన్ని గ్రహించాలని కోరారు. దేశంలోనీ ఆర్మీ, నేవీ, సెంట్రల్‌ ‌ఫోర్స్, ‌రైల్వే, బ్యాంకింగ్‌ ‌రంగ వివిధ సంస్థల్లో 15లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని కేంద్ర బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఈ విషయంపై తెలంగాణ బిజెపి నేత బండి సంజయ్‌ ‌కేవలం7.5 లక్షల ఉద్యోగాలే ఖాళీలు ఉన్నాయనీ, చెప్పకనే తమ తప్పులు ఒప్పుకున్నారని, వెంటనే ఆ ఖాళీలు భర్తీ చేయించాలని బండికి మంత్రి సవాల్‌ ‌విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1 లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు, త్వరలోనే మిగతావి కూడా భర్తీ చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తే బిజెపి పార్టీ ప్రభుత్వం రైతును ముంచే ప్రయత్నం చేస్తుందనీ ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై కక్ష గట్టిందనీ, సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. అంతకుముందు గ్రామంలోని అంబేద్కర్‌ ‌విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. మంత్రి హరీష్‌రావుకు చింతమడక గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ..బాణాసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్‌ఎస్‌ ‌నేతలు, డబుల్‌ ‌బెడ్‌ ‌రూం ఇండ్ల లబ్దిదారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More