నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం
హైదరాబాద్ ఫిబ్రవరి 8: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఉప్పల్ బస్టాండ్ దగ్గర గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు.
ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వాసనీయ సమాచారం మేరకు రాజస్థాన్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి కేజిన్నర డ్రగ్స్, రెండు మొబైల్స్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.