కలకలం రేపిన సిలిండర్ పేలుడు
న్యూఢిల్లీ: అబుదాబిలో కలకలం రేపిన పేలుళ్లు ఉగ్రవాద చర్యలు కావని అధికారులు నిర్ధారించారు. డౌన్టౌన్లోని ఓ అపార్టుమెంటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. హౌతి తిరుగుబాటుదారులు క్షిపణులను ప్రయోగించారని తొలుత భావించారు. అబుదాబిలో ఏకంగా ఎమర్జెన్సీ ప్రకటించారు. హైవేలను మూసివేశారు అధికారులు. అయితే, ఇది అగ్నిప్రమాదంగా స్థానిక అధికారులు ప్రకటరించారు. అయితే.. సిలిండర్ బ్లాస్ట్గా తేల్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా , ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కలగలేదని స్థానిక మీడియా వెల్లడించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని హమ్దాన్ స్ట్రీట్ ఫిఫా క్లబ్ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇస్తుండగా పేలుడు సంభవించింది. యెమెన్ యొక్క హౌతీ తిరుగుబాటుదారులు అబుదాబిని లక్ష్యంగా చేసుకుని అనేక దాడులను ప్రారంభించిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ యేడాఇ జనవరి 17న జరిగిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఆరుగురు గాయపడ్డారు.