డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ, కొత్త డీజీపీగా రాజేంద్రనాధ్ రెడ్డి
అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీవేటు పడింది. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి (1992౧ బ్యాచ్) ని నియమించారు. తాత్కాలికంగా అయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని తమ బలాన్ని ప్రదర్శించారు.
పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలి వచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. అయనకు ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్టు చేయమని ఆదేశాలు జారీ అయ్యాయి.