ఏపి లో జిఓల జారీకి పాత పద్దతి
అమరావతి: ఏపి ప్రభుత్వం ఉత్తర్వుల జారీ కోసం పాత విధానాన్ని అనుసరించాలని నిర్ణయం తీసుకున్నది. ఆన్ లైన్ లో పెట్టడం మూలంగా లేని తలనొప్పులు వస్తున్నాయని భావించిన సర్కార్ పాత విధానం అనుసరించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇకనుంచి ప్రభుత్వంలో ప్రతి శాఖ ఉత్తర్వుల జారీకి రిజిష్టర్లను నిర్వహించాలను సాధారణ పరిపాలన విభాగం (జిఏడి) సర్క్యూలర్ జారీ చేసింది. జిఒఎంఎస్, జిఒ ఆర్ టి, జిఒపి పేరిట మూడు రిజిష్టర్లను ప్రతి శాఖ నిర్వహించాలని సూచించింది. ఏపి సెక్రెటేరియట్ మాన్యువల్ 2005 ప్రకారం గతంలో జారీ చేసినట్లుగానే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు 3 రిజిష్టర్లను ఏర్పాటు చేయాలని తన సర్క్యూలర్ లో స్పష్టం చేసింది.