ఆసుపత్రిలో చేరిన నీరజ్ చోప్రా
చండీగఢ్: జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇవాళ ఉదయం నుంచి కారు టాప్ పై కూర్చుని అందరికి అభివాదం చేస్తూ తన స్వగ్రామానికి ర్యాలీగా బయలుదేరాడు. ఆరు గంటల పాటు సాగిన ర్యాలీలో నీరజ్ నీరసించిపోయాడు.
నీరసంగా ఉన్న నీరజ్ ను స్వగ్రామం సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, కరోనా కూడా సోకలేదని స్నేహితులు వెల్లడించారు. ఒలింపిక్స్ లో గెలుపొందిన తరువాత తొలిసారి ఇవాళ స్వగ్రామం సమల్ఖాకు నీరజ్ చోప్రా ఢిల్లీ నుంచి బయలుదేరాడు. ర్యాలీగా బయలుదేరిన అతనికి దారి పొడవునా ఘన స్వాగతం లభించింది. పానిపట్ కు చేరుకున్న సమయంలో నీరజ్ నీరసించడంతో స్నేహితులు ఆసుపత్రికి తరలించగారు. ఒలింపిక్స్ లో గెలుపొందిన తరువాత తీరిక లేకుండా కార్యక్రమాలలో బిజీగా గడపడం మూలంగా అస్వస్థతకు గురయ్యాడు. ఈ వార్త తెలుసుకున్న గ్రామస్థులు, జిల్లావాసులు తీవ్రంగా కలత చెందారు.