సామాజిక కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం వహించాలి – కర్లపాటి
సామాజిక కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం వహించాలి – కర్లపాటి
జగ్గయ్యపేట
యువత వ్యక్తిగత లక్ష్యాలతో పాటు సామాజిక లక్ష్యాలను కూడా కలిగి ఉండాలని కర్లపాటి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, సామాజికవేత్త కర్లపాటి వెంకట శ్రీనివాస్ రావు తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో యువత యువజన సంఘాలుగా ఏర్పాటై ప్రభుత్వ, ప్రభుత్వేతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఆసక్తి కలిగిన యువత తమ ట్రస్టుని సంప్రదించాలని ఆయన కోరారు. యువజన సంఘాలుగా ఏర్పాటు చేసి అవసరమైన శిక్షణ యువజన సంఘాల బలోపేతం, పుస్తక నిర్వహణ, ఫండ్ రైజింగ్ తదితర అంశాలలో యువజన సంఘాల కు శిక్షణ ఇవ్వనట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో ప్రభుత్వాలు సైతం యువశక్తి సంఘాల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 91540 22922 సంప్రదించాలని ఆయన సూచించారు.