కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి),సెప్టెంబర్ 11: తండ్రి మరణంతో మనస్థాపానికి గురైన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహెచ్ఈఎల్ కో-ఆపరేటివ్ అపార్ట్మెంట్ బ్లాక్ ఏ, ఫ్లాట్ నెంబర్ 508 లో నివాసం ఉంటున్న రాజస్థాన్ కు చెందిన హరిలాల్ పురోహిత్ కుమారుడు భీమ్ సింగ్ (24) ఆదివారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తన బెడ్ రూమ్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల తన తండ్రి గుండెపోటుతో ఆగస్టు 31వ తేదీన మరణించాడు. అప్పటినుండి భీమ్ సింగ్ మనస్థాపానికి గురై డిప్రెషన్ లోకి వెళ్ళాడు. కాగా ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.