ఎట్టకేలకు శిధిలాల క్రింద ఇరుక్కున్న కార్మికుడు బయటకు….
• సెల్లార్ గోడ శిథిలాల క్రింద 9 గంటలు ఇరుక్కొన్న కార్మికుడు
• రాత్రి 9 గంటలకు సురక్షితంగా బయటకు
• చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు
• నీరు వెళ్లే మార్గం లేక మట్టి కుంగడంతోనే ప్రమాదం
• ఇటుకల రిటైనింగ్ గోడ కావడం ప్రధానం కారణం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 3: కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధి శ్రీనిలయ ఎన్ క్లేవ్ లోని సాయిరాం బృందావన్ అపార్ట్ మెంట్ సెల్లార్ గోడ కూలి వాటి శిథిలాల క్రింద ఇరుక్కుపోయి నరకయాతన అను
భవించిన కార్మికుడు బానోతు రెడ్డి (35)ని ఎట్టకేలకు రాత్రి 9 గంటల ప్రాంతంలో బయటకు తీసి చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి అధికారులు తరలించారు. సోమవారం ఉదయం సుమారు 11.45 గంటలకు గోడ కూలి
ఇరుక్కుపోయిన కార్మికుడిని జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది సం
యుక్తంగా సహాయక చర్యలు చేపట్టి సుమారు 9 గంటల పాటు శ్రమించి రాత్రి 9 గంటల ప్రాంతంలో బాధితుడిని
సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
బాధితుడి రెండు కాళ్లు, నడుం వరకు శిధిలాల క్రింద ఇరుక్కుకొని ఉండిపోవడంతో 9 గంటల పాటు బాధితుడు తీవ్ర వేదనతో ఆర్తనాదాలు చేశాడు. బానోతు రెడ్డిని శిథిలాల క్రింద నుంచి బయటకు తీసిన అనంతరం అతను కాళ్లను కొద్ది కొద్దిగా కదుపుతున్నాడని, కాళ్లకు దీర్ఘకాలిక ఇబ్బందులు ఏమి ఉండకపోవచ్చని అధికారుల అంచనా.
గోడ కూలడానికి కారణాలు ఇవేనా..?
సాయిరాం బృందావన్ అపార్ట్ మెంట్ ను జిహెచ్ఎంసి అనుమతుల ప్రకారం 2011వ సంవత్సరంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో అపార్ట్ మెంట్ సెల్లార్ లోని రిటైనింగ్ గోడను కాంక్రీటుతో కాకుండా తూతూ మంత్రంగా ఇటుక గోడను నిర్మించారు. అంతేకాకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న డ్రైవ్ వే (వాహనాల దారి) కోసం సెల్లార్ గోడకు ప్రహారీ గోడకు మధ్య మట్టితో నింపారు. అదే మట్టిలో అపార్ట్ మెంట్ డ్రైనేజీ వైపులైన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. దానికి
తోడు పక్కనే ఉన్న కౌండిన్య అపార్ట్ మెంట్ సముదాయంలో నీటి శుద్ధీకరణ కోసం సంపులు ఏర్పాటు చేసినప్పటికీ వాటి నుంచి నీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఆ నీరు కూడా సదరు మట్టిలోకి వచ్చి చేరుతున్నాయనే వాదన వినిపిస్తుంది. దీంతో రెండు వైపుల నుంచి మట్టిలోకి నీరు చేరి బయటకు వెళ్లే మార్గం లేక సెల్లార్ ఇటుక గోడపై భారం పడడంతో కుప్పకూలినట్లు తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా సెల్లార్ గోడ నీరు చిమర్చడం నీరు సెల్లార్ లో పారడంతో పాటు వర్షాలు కురిసినప్పుడు ముంపుకు గురవుతుందనే విషయాన్ని స్థానికులు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి సమస్య ఉన్నా పట్టించుకోని అపార్ట్ మెంట్ నిర్మాణదారుడు, సంక్షేమ సంఘం సభ్యులు గత మూడు రోజుల క్రితం సమస్య పరిష్కారానికి సిద్ధమై పనులు ప్రారంభించారు. దీంతో ఇటుక గోడ పక్కనే కాంక్రీట్ గోడ నిర్మించాలనే ఉద్ధేశ్యంతో పునాదుల కోసం సుమారు 2 అడుగుల లోతు గుంతలు తీసే పనులను ప్రారంభించారు.
దీంతో అప్పటికే బాగా నానిపోయి ఉన్న సెల్లార్ గోడ పక్కనే గుంతలు తీస్తున్న ఓ కార్మికుడిపై ఒక్కసారిగా
కుప్పకూలిపోయింది.