~ 21వ రౌండ్ ముగిసేసరికి 3,86,258 ఓట్ల ఆధిక్యం లో ఈటల
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 4 : మల్కాజిగిరి నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ లో 21వ రౌండ్ ముగిసింది. 21వ రౌండ్ తో మొత్తం 19,09,174 ఓట్లను లెక్కించారు. అధికారిక లెక్కల ప్రకారం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 9,77,757 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునితా మహేందర్‌రెడ్డికి 5,91,499 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 2,97,636 ఓట్లు పోలయ్యాయి. దీంతో 21వ రౌండ్ ముగిసేసరికి ఈటల రాజేందర్ సమీప ప్రత్యర్థి సునితా మహేందర్ రెడ్డి కన్నా 3,86,258 ఓట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టిఆర్ఎస్ మూడో స్థానంలో కొనసాగుతుంది.