56,165 కుత్బుల్లాపూర్ బీజేపీ మెజార్టీ
~ ప్రతీ రౌండ్లోనూ ఆ పార్టీదే హవా
~ మొత్తం పోలైన ఓట్లు 3,63,949
~ బీజేపీకి 1,77,122 ఓట్లు..కాంగ్రెస్ కు 1,20,957 ఓట్లు..బీఆర్ఎస్ కు 58,039 ఓట్లు
~ 2,322 ఓట్లతో 4వ స్థానంలో నిలిచిన నోటా
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 4 : మల్కాజిగిరి పార్లమెంటు ఓట్ల లెక్కింపులో బీజేపీ హవా జోరుగా వీస్తుంది. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కూడా బీజేపీ హవా ఎక్కడా తగ్గకుండా వీచిందనే చెప్పుకోవాలి. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి చివరి రౌండైన 22వ రౌండ్ వరకు ఏ ఒక్క రౌండ్లో కూడా వెనుకంజ వేయకుండా ప్రతీ రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దే పైచేయిగా కొనసాగింది. అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ ఏ రౌండ్లో కూడా బీజీపీకి పోటీ ఇవ్వలేక పోయారు.
కుత్బుల్లాపూర్ ఓట్ల లెక్కింపు వివరాలు…
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్నెంట్ లో పార్లమెంట్ ఎన్నికలకు మొత్తం 3,63,949 ఓట్లు పోలయ్యాయి. వీటిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 1,77,122 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునితా మహేందర్‌రెడ్డికి 1,20,957 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థికి 58.039 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కల ప్రకారం ఈటల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి సునితా మహేందర్‌రెడ్డిపై 56,165 ఓట్ల మెజార్టీని సాధించారు. కుత్బుల్లాపూర్‌లో నోటాకు 2,322 ఓట్లు రావడంతో 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది.