మల్కాజిగిరి పార్లమెంటులో వికసించిన కమలం

> 3, 91,475 ఓట్ల భారీ మెజార్టీతో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు
> తొలి రౌండ్ నుంచే ముందంజ లో బిజెపి అభ్యర్థి
> ఈటలకు ఎంపీగా ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందచేసిన మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్వో గౌతమ్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 4 : పార్లమెంటు ఎన్నికలు-2024లో మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ హస్తగతమైంది. మల్కాజిగిరి లోక్ సభ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గతంలో ఎప్పుడూ లేని విధంగా అనూహ్యంగా 3,91,475 ఓట్ల భారీ మెజార్టీతో కైవసం చేసుకున్నారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అన్ని సెగ్మెంట్లలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు సింహభాగం ఓట్లను పంచుకున్నాయి. అయితే బీజేపీ పార్టీకి ఏ ఒక్క సెగ్మెంట్ లో గానీ, ఓట్ల లెక్కింపు జరిగేటప్పుడు ఏ ఒక్క రౌండ్ గానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎదురు నిలువలేకపోయినట్లుగా తెలుస్తుంది.

ఎన్నిక ధ్రువీకరణ పత్రంతో ఈటల రాజేందర్

ఏ పార్టీ లెక్క ఎంత…
మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 19,34,065 చెల్లుబాటు ఓట్లు పోలయ్యాయి. వీటిలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు 9,91,042 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్రెడ్డికి 5,99,567 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 3,00,486 ఓట్లు వచ్చాయి. ఈ అధికారిక లెక్కల ప్రకారం ఈటల రాజేందర్ తన సమీప ప్రత్యర్ధి సునీతా మహేందర్రెడ్డి పై 3,91,475 ఓట్ల భారీ మెజార్టీని సాధించి మల్కాజిగిరి పార్లమెంటు గడ్డపై బీజేపీ జండాను పాతారు.
లెక్కింపు గణాంకాలు ఇలా…
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో…
మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్నెంట్లో మొత్తం 9,63,949 ఓట్లు పోలవగా.. వీటిలో బీజేపీకి 1,77,122 ఓట్లు, కాంగ్రెస్ కు 1,20,957 ఓట్లు, బీఆర్ఎస్ కు 58,039 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీకి కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 56,165 ఓట్ల మోజార్టీ లభించింది.
మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లో…
మేడ్చల్ అసెంబ్లీ సెగ్నెంట్లో మొత్తం 3,85,134 ఓట్లు పోలవ్వగా.. వీటిలో బీజేపీకి 1,88,370 ఓట్లు, కాంగ్రెస్ కు 1,19,125 ఓట్లు, బీఆర్ఎస్ కు 67,246 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీకి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 69,245 ఓట్ల మోజార్టీ దక్కింది.
మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో …
మల్కాజ్ గిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం 2,63,281 ఓట్లు పోలవ్వగా.. వీటిలో బిజెపికి 1,39,479 ఓట్లు, కాంగ్రెస్ కి 77,929 ఓట్లు, బీఆర్ఎస్ కి 40,488 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీకి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 61,550 ఓట్ల మోజార్టీ వచ్చింది.
కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో…
కూకట్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం 2,31,879 ఓట్లు పోలవగా.. వీటిలో బీజేపీకి 1,09,820 ఓట్లు, కాంగ్రెస్ కి 84,700 ఓట్లు, బీఆర్ఎస్ కి 32788 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీకి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 25.120 ఓట్ల మోజార్టీ దక్కింది.
ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో…
ఉప్పల్ అసెంబ్లీ సెగ్నెంట్లో మొత్తం 2,61,634 ఓట్లు పోలవగా.. వీటిలో బీజేపీకి 1,30105 ఓట్లు, కాంగ్రెస్ కి 76,870 ఓట్లు, బీఆర్ఎస్ కి 48,958 ఓట్లు వచ్చాయి. దీని ప్రకారం బీజేపీకి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 53,235 ఓట్ల మెజార్టీ లభించింది.
ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో…
ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్నెంట్లో మొత్తం 2,79,463 ఓట్లు పోలవగా.. వీటిలో బీజేపీకి 1,71,683 ఓట్లు, కాంగ్రెస్ కి 68,095 ఓట్లు, బీఆర్ఎస్ కి 33,839 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీకి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 1,03,588 ఓట్ల భారీ మోజార్టీని చేజిక్కించుకుంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నెగ్నెంట్లో మొత్తం 1,29,845 ఓట్లు పోలవగా.. వీటిలో బీజేపీకి 64,133 ఓట్లు, కాంగ్రెస్ కి 45,661 ఓట్లు, బీఆర్ఎస్ కి 17,339 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీకి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 18,472 ఓట్ల మోజార్టీ దక్కింది.
మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి నోటాకు మొత్తం 13,366 ఓట్లు వచ్చాయి. అలాగే 222 ఓట్లు పలు కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యాయి. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లో వరుసగా ప్రథమ స్థానంలో బీజేపీ, ద్వితీయ స్థానంలో కాంగ్రెస్, తృతీయ స్థానంలో బీఆర్ఎస్ ఉండగా 4వ స్థానం లో నోటా నిలవడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More