జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన డిసిపి సురేష్ కుమార్
~ పిఎస్ పరిధిలో శాంతిభద్రలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశం
~ పీఎస్ పరిధిలోని సునితమైన ప్రాంతాల్లో సిబ్బందితో కలిసి పాదయాత్ర
జగద్గిరిగుట్ట (న్యూస్ విధాత్రి), జూన్ 26 : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్లు, జన సంచారం అధికంగా ఉన్నచోట, నిర్మానుష్య ప్రాంతాలు, దోపిడీలు జరిగే ప్రాంతాలతో పాటు వాహనాలకు తనిఖీలను ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ శాంతిభద్రలపై ప్రత్యేక దృష్టి సారించాలని బాలానగర్ డిసిపి కే. సురేష్ కుమార్ ఆదేశించారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు తీసుకున్న డిసిపి బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి పోలీస్ సిబ్బంది, ఫిర్యాదుదారుల ను కలిసి వివరాలు తెలుసుకున్నారు. అలాగే పీఎస్ పరిధిలోని సున్నితమైన ప్రాంతాలను సందర్శించారు.
ఎల్లమ్మబండలో పాదయాత్ర నిర్వహించి స్థానికులను కలిసి శాంతిభద్రతులపై ఆరా తీశారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఎల్లమ్మబండ చెరువు కట్టను సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ ఏసీపీ హనుమంతరావు, సీఐ క్రాంతి కుమార్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.