సర్వే నెంబర్ 25/2లోని ప్రభుత్వ స్థలంలో ఆక్రమ నిర్మాణాల కూల్చివేతలు
• అధికారుల విధులకు ఆటంకం, ఎదురు దాడికి పాల్పడిన..
• అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పీఎన్ ఆర్ఎస్ఐ ఫిర్యాదు
• పోలీసు బందోబస్తు కోసం పీఎస్ లో వినతి
• సుమారు 3 గంటల పాటు పడిగాపులు కాసిన ఆర్ఐ
• చివరకు పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు
కుత్బుల్లాపూర్ (న్యూన్ విధాత్రి), జూన్ 28 : ప్రభుత్వ స్థలంలో ఆక్రమంగా గదులు నిర్మిస్తూన్నారని సమాచారంతో అక్కడకు వెళ్తే కబ్జాదారులు తమ విధులకు ఆటంకం కలిగిస్తూ, ఎదురు దాడికి దిగుతున్నారని కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ (గిర్దావర్) రేణుకాదేవి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. తమ విధి నిర్వహణలో భాగంగా పేట్ బషీరాబాద్ గ్రామంలోని సర్వే నెంబర్ 25/2లోని ప్రభుత్వ స్థలం లో ఆక్రమణపై విచారించేందుకు సిబ్బందితో కలిసి శుక్రవారం అక్కడకు వెళ్లామని ఆర్ఐ తెలిపారు. ఆ సమయంలో ప్రభుత్వ స్థలంలో వినాయక నర్సరీ పేరుతో నిర్వహిస్తున్న నర్సరీ యజమానులు సత్యనారాయణ మూర్తి, భాగ్యలక్ష్మి ప్రభుత్వ స్థలంలో ఆక్రమంగా నిర్మించిన నిర్మాణాన్ని తొలగించేందుకు ప్రొక్లెయినర్ తో వెళ్లగా భాగ్యలక్ష్మి ఆమె కూతురు ఉమామహేశ్వరి దేవి ఆక్రమ నిర్మాణాలను కూల్చకుండా తమ రెవెన్యూ సిబ్బందిపై దాడికి దిగారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలంలో ఆక్రమ నిర్మాణాలను చేపడుతూ, తమ విధులకు ఆటంకం కలిగించి, తమపై దాడికి దిగిన వారిపై చట్టవరమైన చర్యలు తీసుకోవాలని ఆర్ఐ ఫిర్యాదు చేశారు.
– పోలీసు బందోబస్తుతో కూల్చివేతలు…
అంతకు ముందు ఉదయాన్నే సర్వే నెంబర్ 25/2లో అక్రమ నిర్మాణాలను పరిశీలించి, వాటిని తొలగించేందుకు సిబ్బందితో కలిసి ఆర్ఐ అక్కడకు చేరుకున్నారు. కూల్చివేతలకు అక్రమార్కులు సనేమిరా అని విధులకు అడ్డుపడి, వారిపై ఎదురు దాడికి దిగారు. దీంతో ఆర్ఐ రేణుకాదేవి పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ కు చేరుకొని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన నిర్మాణాలను కూల్చేందుకు పోలీసు బందోబస్తు కావాలని విన్నవించారు. ఆ సమయంలో సీఐ స్టేషన్ లో లేకపోవడంతో సుమారు 3 గంటలు పోలీసు
స్టేషన్ లోనే పడిగాపులు కాయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. అనంతరం సీఐ వచ్చాక ఏసీపీ ఆదేశాలతో మధ్యాహ్నం అనంతరం బందోబస్తు కోసం సిబ్బందిని పం
వడంతో వారి సహాయంతో సదరు నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. గతంలో కూడా అదే స్థలంలో ఆక్రమ నిర్మాణాలు చేపడితే కూల్చివేశామని, పలుమార్లు ఆక్రమార్కులను
హెచ్చరించినా…మాట లెక్క చేయకుండా మరల మరల ప్రభుత్వ స్థలంలో ఆక్రమ నిర్మాణాలు కడుతున్నారని ఆమె తెలిపారు. ఈసారి నిర్మాణాలు చేపడితే క్రిమినల్
కేసులు నమోదు చేస్తామని ఆర్ఐ హెచ్చరించారు.