అనిల్ ను హత్య చేశారా…? ఆత్మహత్య చేసుకున్నాడా…?
అనిల్ ను హత్య చేశారా…? ఆత్మహత్య చేసుకున్నాడా…?
~ జగద్గిరిగుట్ట పిఎస్ లో సంఘట
~ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
జగద్గిరిగుట్ట (న్యూస్ విధాత్రి), జూన్ 29 : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హతమార్చి నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. మృతుడు 6 అంబులెన్స్ లను నిర్వహిస్తూ (మెయింటెన్) భార్యతో కలిసి జగద్గిరిగుట్ట వెంకటేశ్వర నగర్ లో జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తుంది. అదే ప్రాంతంలో అతని భార్య టిఫిన్ సెంటర్ ను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇంట్లో ఎవరూ లేనప్పుడు స్వయంగా తానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని సమాచారం ఉన్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మృతుడి చాతి పై ఎవరో బలంగా కత్తితో దాడి చేసినట్లుగా కనిపిస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.