నిజాంపేట్ కార్పొరేషన్ లో బిజెపి నాయకులు మూకుమ్మడి రాజీనామాలు
నిజాంపేట (న్యూస్ విధాత్రి ), జూలై 12 : నిజాంపేట కార్పొరేషన అధ్యక్షుడు ఆకుల సతీష్ తో పాటు కమిటీలో ఉన్న వివిధ విభాగాల నాయకులు తమ బాధ్యతలకు ముకుమ్మడిగా శుక్రవారం రాజీనామాలు చేశారు. నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయి నాయకులు కొందరు కుట్రపూరితంగా కార్పొరేషన్ లో చురుగ్గా పనిచేస్తూ కొనసాగుతున్న పార్టీ కమిటీని ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండానే ఈనెల 9వ తేదీన మూడు గ్రామాలకి గ్రామ అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో నిజాంపేట్ కార్పొరేషన్ కమిటీ తీవ్ర ధిగ్భ్రాంతికి గురికావడమే కాకుండా అభ్యంతరాలు వ్యక్తం చేసిన పట్టించుకోకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ తమ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆకుల సతీష్ మాట్లాడుతూ కార్పొరేషన్ లో పార్టీ ఎదుగుదలను ఓర్వలేని రాష్ట్ర, జిల్లా , అసెంబ్లీ స్థాయి బాధ్యతల్లో ఉన్న నాయకులు ఈ విధంగా చేయడం, వైరిపక్ష ప్రజా ప్రతినిధికి లబ్ధి చేకూర్చే విధంగా పార్టీలో ఇలాంటి నిర్ణయాలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. పార్టీ పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, పార్టీలో నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా, ఇష్టారాజ్యంగా కొందరు సీనియర్ నాయకుల చర్యలపై రాష్ట్ర, కేంద్ర పార్టీ దృష్టి సారించి ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సంస్థగత ఎన్నికలు జరిగే వరకూ కార్పొరేషన్ కమిటీని కొనసాగించాలని, రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా కార్పొరేషన్ లో గ్రామ కమిటీల అధ్యక్షుల నియామకం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ లో ప్రజా సంపద, పౌరుల మౌలిక సమస్యల పరిష్కారంలో గతంలో ఏ విధంగా పని చేశామో రాజీనామా చేసిన కూడా మరింత చురుకుగా పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి గొల్ల కృష్ణ, రాష్ట్ర మైనార్టీ మోర్చా ప్రముఖ అమలేశ్వరి, జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు కాశి, సెక్రటరీ అరుణ్ రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సోషల్ మీడియా కో కన్వీనర్ విజయ్ కుమార్, తిలోక్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రాము, మహిళా మోర్చా అధ్యక్షురాలు కవిత రెడ్డి, ఓబీసీ మోర్చా జనరల్ సెక్రెటరీ ముఖేష్, ఉపాధ్యక్షులు కుమార్ గౌడ్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు, ట్రేడర్ సెల్ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, సతీష్ కృష్ణ , పట్నాయక్, డివిజన్ అధ్యక్షులు మాధవరావు, ప్రదీప్ కుమార్, ఎల్ల స్వామి, శ్రీనివాస్, హనుమయ్య, చిరంజీవి, మోక్ష శ్రీ, నరోత్తం రెడ్డి ,వెంకటేష్, కృష్ణ, జి రాజేష్ వరుణ్ రెడ్డి నవీన్, సందీప్, యాకూబ్, సుధాకర్, మహేష్ , అనునియతో పాటు పలువురు తమ బూత్, డివిజన్ అధ్యక్షులు బాధ్యతలకు రాజీనామా సమర్పించారు.