• టీయూడబ్ల్యూజె ఐజేయూ రాష్ట్ర నూతన అధ్యక్షుడు విరాహత్ అలీ
• యూనియన్ సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించాలి
• ట్రేడ్ యూనియన్, కార్మిక చట్టాలపై అవగాహన అవసరం
• గత ప్రభుత్వంలో ఎన్నో కష్టనష్టాలను చవి చూసిన జర్నలిస్టులు.
• ప్రస్తుతం సమస్యలపై లోతైన అధ్యయనం జరుగుతుందని వ్యాఖ్య
• త్వరలోనే హెల్త్ కార్డులు, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు
• రాష్ట్ర నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించిన జర్నలిస్టులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 16 : జర్నలిస్టుల తరపున ఏ సమస్యపైనైనా పోరాటం చేసి పరిష్కరించే ఘనత ఆప్పుడైనా.. ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజె ఐజేయూ) దక్కుతుందని ఆ సంఘ రాష్ట్ర నూతన ఆధ్యకులు విరాహత్ అలీ అన్నారు. ఈ మేరకు యూనియన్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శాఖ, కూకట్పల్లి ప్రెస్ క్లబ్ నేతృత్వంలో శేషాద్రినగర్ కమ్యూనిటీ భవనంలో ఆత్మీయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. టీయూడబ్ల్యూజె- ఐజేయూ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు అధ్యక్షతన సంఘం రాష్ట్ర కమిటీలో గ్రేటర్ హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బాధ్యులను పలువురు జర్నలిస్టులు సత్కరించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన విరాహత్ అలీకి గజమాల వేసి, శాలువాలు కప్పి, జ్ఞాపికను అందించి ఘనంగా సన్మానించారు. యూనియన్ లోని ప్రతి సభ్యుడు యూనియన్ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో క్రియాశీలకంగా పాల్గొని, ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని యూనియన్ కార్యకలాపాలతో పాటు దాని స్వభావంపై చైతన్యపరిచి, చర్చింకోవాలని సూచించారు. ట్రేడ్ యూనియన్, కార్మిక చట్టలపై పట్టు సాధించాలని, అప్పుడే సమస్యలపై పోరాడి పరిష్కరించుకోగలమని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో 10 సంవత్సరాలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఎన్నో కష్టనష్టాలను చవి చూశామన్నారు. పలు జిల్లాల్లోని జర్న లిస్టులు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా పడ్డ కష్టాలు వర్ణనాతీతమని, కష్ట కాలంలో ఆస్తులు తాకట్టు పెట్టి చికిత్స పొంది అప్పుల పాలైన వారు కొందరైతే, ఎంతో మంది హెల్త్ కార్డులు లేక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీయూడబ్ల్యూజె-ఐజేయూ ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో ఆందోళనలు, ఉద్యమాలు చేసినా కనీస స్పందన కూడా లేని పాలనలో జర్నలిస్టులు కన్నీటిని దిగమింగుకొని నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారని మండిపడ్డారు. ఒక వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ దేశ స్థాయిలో గరిస్తున్నటు వంటి గుంతైన కె. శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ గా నియమించడం శుభ పరిణామమని, దీంతో ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూలంగా ఉన్నట్టు ఆశిస్తున్నన్నారు. జర్నలిస్టుల పక్షపాతి శ్రీనివాస్ రెడ్డి అని, బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారం, అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ వంటి ఇతరాత్ర సమస్యలపై తీవ్ర కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి జర్నలిస్టులకు ఇదివరకు ఇచ్చిన ఇళ్ల స్థలాల వివరాలతో పాటు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థలాల వివరాలను తీసుకొని సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆంతేకాకుండా మునువెన్నడూ లేని విధంగా సమాచారం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో విలేకరుల సమస్యలపై తరచుగా సమావేశాలు, చర్చలు జరుపుతూ పటిష్టమైన ప్రణాళికతో వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారన్నారు. అక్రిడిటేషన్ కార్డులు మార్కెట్ లో అంగడి సరుకులుగా మారిపోయాయని, వాటిని అరికట్టాల్సిన అవసరం వాస్తవ జర్నలిస్టులపై ఎంతైనా ఉందని తెలిపారు.
• గత ప్రభుత్వంలో చేద్దాం.. చూద్దాం.. అంటేనే పాలాభిషేకాలు..
గత ప్రభుత్వ హయాంలో ఓ సంఘం ఎంతసేపు ప్రభుత్వం తమ జేబులో ఉందని, తాము ఏమి చేసినా చెల్లుతుందనే ధోరణిలో జర్న లిస్టుల సమస్యలను పక్కన పెట్టి వారి స్వప్రయోజనాలు, పదవుల కోసం ప్రభుత్వానికి తొత్తులుగా పని చేశారని ఆరోపించారు. ఏదైనా సందర్భంలో ముఖ్యమంత్రి గానీ, ఎవరైనా మంత్రి గానీ జర్నలిస్టుల సమస్యలపై చేద్దాంలే.. చూద్దాంలే.. అని మాట వరసకు అంటేనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసేవారని ఎద్దేవ చేశారు. జర్నలిస్టుల సమస్యల పై కనీస అవగాహన లేని అటువంటి సంఘాలు ఎల్లప్పుడూ జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేసే టి యు డబ్ల్యు జేను ప్రశ్నించడం సిగ్గుచేటు అన్నారు. టీయూడబ్ల్యూజె – ఐజేయూ సంఘం ఎల్లప్పుడూ జర్నలిస్టుల పక్షపాతిగా వారి తరపునే ఉంటుందని, సమస్యలపై ఏ ప్రభుత్వానైన నిందిస్తామని, ఎవరికి తొత్తుగా వ్యవహరించదని స్పష్టం చేశారు. మోసపూరిత మాటలు చెప్పే సంఘాల పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని విరాహత్ అలీ హితవు పలికారు.
సన్మానం అందుకున్న వారిలో యూనియన్ రాష్ట్ర కమిటీ కోశాధికారిగా ఎన్నికైన మోతే వెంకటరెడ్డి, కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి,, కార్యవర్గ సభ్యులు రాజేష్, గౌస్ మొయినుద్దీన్, ఆనిల్, చిన్న, మధ్యతరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసఫ్ బాబా,, ప్రధాన కార్యదర్శి ఆశోక్, హెచ్ యు జె అధ్యక్షుడు శంకర్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మల్కయ్య, మామిడాల రవీందర్ రెడ్డి, సలీం పాషా, పరమేష్, మల్లారెడ్డి, భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ కరీం, రంజిత్, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోటగడ్డ శ్రీనివాస్, కోశాధికారి శేషారెడ్డి, ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి కలికిమూర్తి, వివిధ ప్రాంతాల జర్నలిస్టులు పాల్గొన్నారు.