ఓబీసీ మోర్చా ప్రచార కార్యదర్శిగా కేశవరావు
కూకట్ పల్లి (న్యూస్ విధాత్రి), జూలై 18 : బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా ప్రచార కార్యదర్శి వీరమల్ల కేశవరావు నియమితులయ్యారు. న్యాయవాది వృత్తిలో ఉన్న ఆయనను ఈ మేరకు ప్రచార కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ లు ఆయనకు గురువారం నియామక పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షులు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మాత్యులు జి. కిషన్ రెడ్డి, కేంద్ర ఓబిసి మోర్చా అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు , చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుల సామ రంగారెడ్డి, మేడ్చల్ అర్బన్ జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.రవికుమార్ యాదవ్, రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు ఎల్. నరేందర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్, కోకన్వీనర్ రాఘవేంద్రరావు , మణి భూషణ్ లకు ఈ సందర్భంగా వీరమల్ల కృతజ్ఞతలు తెలిపారు.