కుత్బుల్లాపూర్ గ్రామ నాయి బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 22 : కుత్బుల్లాపూర్ గ్రామంలోని నాయి బ్రాహ్మణుల పటిష్టతకు కృషి చేయాలని ఓం మణికంఠ నాయి బ్రాహ్మణ సేవా సంఘం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు గడిల వెంకటేశ్వర్లు నాయి, ప్రధాన కార్యదర్శి వి.ఎస్.ఆర్.వెంకట్ నాయి అన్నారు. నియోజకవర్గం నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ గ్రామ శ్రీ సాయి నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని గ్రామంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు సంఘం చైర్మన్ గా ఉప్పల భీంరావు నాయి, అధ్యక్షులుగా ఉప్పల హనుమంతరావు నాయి, ప్రధాన కార్యదర్శిగా ఉప్పల వేణుగోపాల్ నాయి, కోశాధికారిగా శ్రీనివాస్ నాయి, ఉపాధ్యక్షుడిగా ఉప్పల మధు నాయి, కార్యవర్గ సభ్యులుగా ఉప్పల వీరేష్ నాయి, ఉప్పల హరి నాయి, ఉప్పల ప్రభాకర్ నాయి, సతీష్ నాయి, వెంకటనారాయణ నాయి, బంటు బాలకృష్ణ నాయిని ఎన్నుకున్నారు.