అక్రమంగా అక్రమించుకుంటున్న ప్రభుత్వ స్థలాలను కాపాడాలి

• అధికారులకు ఫిర్యాదు చేసిన ఆకుల సతీష్, పీసరి కృష్ణారెడ్డి

• ప్రభుత్వ స్థలాన్ని అప్రోచ్ రోడ్డుగా చూపిన అనుమతులు ఇచ్చిన హెచ్ఎండిఏ
• ఆకృతికి ఆసరాగా అధికారుల తీరు
• ఒక సర్వే నెంబర్ చూపి మరో సర్వే నెంబర్లు అక్రమ నిర్మాణాలు
• వెంటనే కూల్చివేయాలని ఎమ్మార్వోకు ఆదేశాలు జారీ చేసిన అదనపు కలెక్టర్
నిజాంపేట (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 12 :

బాచుపల్లి మండలం సర్వేనెంబర్ 454 ప్రభుత్వ స్థలంలోని 400 గజాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకొని, అదే స్థలాన్ని అప్రోచ్ రోడ్డుగా చూపుతూ ఆకృతి కన్స్ట్రక్షన్ సంస్థ హెచ్ఎండిఎ నుంచి అక్రమ అనుమతులు పొంది చేపడుతున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అదనపు కమిషనర్ కు బిజెపి నిజాంపేట్ మాజీ అధ్యక్షుడు ఆకుల సతీష్, పీసరి కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. సర్వేనెంబర్ 454లో ఉన్న 1.34 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసి కంచి ఏర్పాటు చేసే రక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని అప్రోచ్ రోడ్ గా చూపిన అనుమతులు వచ్చిన హెచ్ఎండిఏ జేపీవో సుధీర్ కుమార్, బాచుపల్లి రెవెన్యూ అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకొని, నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు చర్యలు తీసుకొని పక్షంలో త్వరలోనే హైడ్రాను సంప్రదించి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

ఆకృతి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు

• ఒక సర్వే నెంబర్ చూపి మరో సర్వే నెంబర్లు ఆక్రమణ…
ఒక సర్వే నెంబర్ చూపి మరో సర్వే నెంబర్ లో ఆక్రమణలకు పాల్పడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి కి వారు ఫిర్యాదు చేశారు. బౌరంపేట్ సర్వేనెంబర్ 166/9 లో కోట్ల రూపాయలు విలువ చేసే 4.13 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎక్స్ సర్వీస్ మెన్ కు కేటాయింపు పేరుతో కొందరు అక్రమార్కులు కాజేసేందుకు పన్నాగం పన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్వోసీ పొందిన నర్సింగరావు అనే వ్యక్తి పేరు పాత రికార్డుల్లో గాని, పహాని లో కానీ ఎక్కడా లేదని, సదరు సర్వేనెంబర్ లో ప్రభుత్వ పాఠశాల వద్ద ఉందని, ఇదివరకు సదరు సర్వే నెంబర్ ను మరొకరికి కేటాయించారని తెలిపారు. సదరు సర్వే నెంబర్ ను చూపి కత్వ చెరువు వద్ద సుమారు కిలోమీటర్ దూరంలో ఉన్న సర్వేనెంబర్ 166/1లో స్థలాన్ని ఆక్రమించుకొని రెవెన్యూ స్కెచ్, సర్వే తో పాటు ఎటువంటి అనుమతులు పొందకుండా గతంలో నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. సదర నిర్మాణాలను రెండుసార్లు అధికారులు కూల్చిన అవేమీ పట్టనట్టు మరల అక్రమ నిర్మాణాలతో పాటు షెడ్డు కూడా నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. నర్సింగరావు పేరుపై మంజూరు చేసిన ఎన్ఓసి సరైనదో కాదో.. పరిశీలించాలన్నారు. సుమారు రూ.100 కోట్ల విలువ చేసే బౌరంపేట కమాన్ కత్వ చెరువు వద్ద ఆక్రమణ, అక్రమ నిర్మాణం పనులకు సహకరిస్తున్న ఎమ్మార్వో తీరుపై కూడా విచారణ చేపట్టాలని వారు కోరారు. స్పందించిన అదనపు కలెక్టర్ అక్రమ నిర్మాణ పనులు కూల్చి వేసి ప్రభుత్వ భూమి అనే సూచిక బోర్డు పెట్టాలని, అవసరం అయితే కోర్టుకి కౌంటర్ ఫైల్ చేయమని,166/9 ఎన్వోసీని కూడా పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని దుండిగల్ ఎమ్మార్వో ని ఆదేశించారు. ఫిర్యాదులు అందించిన వారిలో మల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అరుణ్ రావు, కుమార్ గౌడ్, ఎల్ల స్వామి పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More