కుత్బుల్లాపూర్ లోని పలు ప్రభుత్వ రంగ శాఖల్లో ఉన్నతాధికారుల తనిఖీల పర్వం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 24: కుత్బుల్లాపూర్ నియోజక వర్గ పరిధిలోని అటు పోలీస్ స్టేషన్, ఇటు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీల పర్వం కొనసాగుతుంది. వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయనే నెపంతో కుత్బుల్లాపూర్ లోని ఆగస్టు నెల నుంచి సర్వేనెంబర్ 55 నుంచి 226 ( 171 సర్వే నెంబర్లలో) రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. దీంతో భూ లావాదేవీలు జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీ ఎత్తున గండి ఏర్పడింది. ఈ విషయమై రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డి ఐ జి మధుసూదన్ రెడ్డి, జిల్లా రిజిస్టర్ అశోక్ తో కలిసి సూరారం లోని కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వివరాలు సేకరిస్తున్నారు.
• దుండిగల్ పోలీస్ స్టేషన్ లో…
దుండిగల్ పోలీస్ స్టేషన్ ను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ఆకస్మిక తనిఖీలు చేశారు. పిఎస్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసు వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు. అంతకుముందు పోలీస్ స్టేషన్ ఆవరణలో మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి, ఎసిపి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు.