ఘనంగా వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 4 : వంగవీటి మోహన రంగా 78వ జయంతిని పురస్కరించుకొని విఎంఆర్ కుత్బుల్లాపూర్ కాపు సేవా సమితి ఆధ్వర్యంలో వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కుత్బుల్లాపూర్ గ్రామంలో ఆయన చిత్రపటానికి సభ్యులు, కుల బాంధవులు, అభిమానులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం పేదలకు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ మేరకు సుమారు 2000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విఎంఆర్ కాపు సేవాసమితి అధ్యక్షులు లింగం రవి, ఉపాధ్యక్షులు విల్లా మూర్తి, కార్యవర్గ సభ్యులు చెన్నం శెట్టి కోటేశ్వరరావు, పుల్లిగడ్డ నాగ కిషోర్, తోట రామ్మోహన్, వేల్పూరి వెంకటరమణ, పప్పుల నాగరాజు, పాలిశెట్టి శ్రీనివాస్, గాజుల జగన్, పవన్ నాయుడు, శ్రీనివాసరావు, తోట శివాజీ, ఆకుల ప్రసాద్, ఏసుబాబు, సుంకర అర్జున్, రాజ్ కిరణ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.