ప్రొఫెసర్ జయశంకర్ కు ఘన నివాళులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 6: తెలంగాణ సిద్ధాంత కర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో ఉప కమిషనర్ వి. నర్సింహ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జయశంకర్ చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. నివాళులర్పించిన వారిలో ఏఎంసీ కృష్ణ, సూపరింటెండెంట్ గిరిబాబు, అధికారులు, సిబ్బంది తో పాటు నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ ఉన్నారు.