ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 5:  బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని పూర్వ కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి బల్‌రెడ్డి నగర్ చౌరస్తాలోని ఆయన చిత్రపటానికి డివిజన్ బిఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బాబు జగ్జీవన్ రామ్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప సంఘ సంస్కర్తగా, ప్రతిభావంతమైన రాజకీయ నాయకుడిగా దేశానికి విశేష సేవలందించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. భారత పార్లమెంటులో సుమారు నాలుగు దశాబ్దాల పాటు వివిధ కీలక మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా కూడా సేవలందించిన ఆయన సామాజిక సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకుడని తెలిపారు. అంటరానితనం నిర్మూలన, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ, గ్రామీణ కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన పోరాటం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, యూత్ అధ్యక్షులు దుడిమెట్ల సోమేశ్ యాదవ్, ఉద్యమ నాయకులు కిషోర్ చారి, సీనియర్ నాయకులు నసీర్, దిలీప్ గౌడ్, జయం చారి, అజయ్ చారి, రమణారెడ్డి, నరసింహ రెడ్డి, జగదీష్, కళ్లెం శ్రీనివాస్, బాలయ్య, కృష్ణ, డీజే రమేష్, నరేష్, మల్లారెడ్డి, దుర్గారెడ్డి, నారాయణ చారి, దుర్గ ప్రసాద్, శ్రీనివాస్ జైన్, యాదగిరి, రియాజ్, అఖిల తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More