బౌరంపేట్ స్నేక్ పార్క్‌లో వాకింగ్ ట్రాక్‌కు వినతి
దుండిగల్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 21: బౌరంపేట్లోని స్నేక్ పార్క్‌లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, అలాగే బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ విషయంపై స్పందించిన ప్రజాప్రతినిధులు వెంటనే మేడ్చల్ జిల్లా అటవీశాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి, పార్క్‌లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సిఫారసు లేఖను బౌరంపేట్ ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎస్వి సురేందర్ రెడ్డి, సరుగారి ధర్మారెడ్డి, పల్పనూరి విష్ణువర్ధన్ రెడ్డి లు అటవీశాఖ అధికారిని కలిసి మంగళవారం అందజేశారు.
వినతిపై స్పందించిన అటవీశాఖ అధికారి సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అధికారులతో చర్చించి త్వరలోనే వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.