కొంపల్లి సర్కిల్ సమస్యలను పరిష్కరించాలని డిసికి వినతి

• సమస్యలను వివరించిన విజి హోమ్స్ నివాసితులు 

కొంపల్లి (న్యూస్ విధాత్రి), మే 6: కొంపల్లి ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం విజి హోమ్స్ నివాసితులు ముందుకు వచ్చారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కొంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ డి. లావణ్యను మర్యాదపూర్వకంగా కలిసి బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు కమ్యూనిటీతో పాటు పరిసర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను డిసి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా నాలా పొంగి పొర్లడం వల్ల వ్యాపిస్తున్న దుర్వాసన, కాసా ఉజ్జయిని అపార్ట్‌మెంట్ పరిసరాల్లో డ్రైనేజ్ లీకేజీలు, బిగ్ బాస్కెట్ నుంచి విజి హోమ్స్ వరకు వీధి దీపాల కొరత, దోమల నివారణకు అవసరమైన ఫాగింగ్, పరిశుభ్రత లోపాలు, వీధి కుక్కల బెడద వంటి అంశాలను వివరించారు. అదేవిధంగా, విజి హోమ్స్ నివాసితులు తమ కమ్యూనిటీ తరఫున సామాజిక సేవా కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, ప్రజా సంక్షేమం, కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమస్యలపై స్పందించిన డిసి లావణ్య నివాసితులు చూపిన ఐక్యతను, బాధ్యతాయుతమైన వైఖరిని అభినందించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఐక్యంగా ఉంటేనే కమ్యూనిటీతో పాటు సర్కిల్ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె తెలిపారు. డిసి ని కలిసిన వారిలో భీమ్ రెడ్డి దయాకర్ రెడ్డి, శివ కుమార్ గౌడ్, కిషోర్, వీరన్ రెడ్డి, వాసు, సంతోష్, చక్రవర్తి గౌడ్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More