దోమల నివారణకు అధికారుల చర్యలు.. కృతజ్ఞతలు తెలిపిన విజి హోమ్స్ నివాసితులు

కొంపల్లి (న్యూస్ విధాత్రి), మే 7:  కొంపల్లి సర్కిల్ పరిధిలోని విజి హోమ్స్ పరిసర ప్రాంతాల్లో దోమల సమస్య తీవ్రంగా మారడంతో స్థానిక నివాసితులు బుధవారం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నాలా పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న దోమల వ్యాప్తి, ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న నేపథ్యంలో నివాసితులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన కొంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ డి. లావణ్య వెంటనే స్పందించి సంబంధిత అధికారులను చర్యలకు ఆదేశించారు. ఆమె ఆదేశాల మేరకు గురువారం ఏఈ వనజ, ఎంటమాలజీ బృందం ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.

దీనిలో భాగంగా కమ్యూనిటీతో పాటు నాలా పరిసర ప్రాంతాల్లో యాంటీ లార్వ స్ప్రేయింగ్, దోమల నివారణ చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా నిల్వ నీరు ఉన్న ప్రాంతాల్లో మందుల పిచికారీ నిర్వహించి దోమల వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం అంశాల్లో అధికారులు వేగంగా స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై విజి హోమ్స్ నివాసితులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డి సి లావణ్య, ఏఈ వనజ, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More