Author: sairam

  • ‘రంగరంగ వైభవంగా’ నుంచి ఫస్టు సింగిల్ రెడీ!

    ‘ఉప్పెన’ వంటి రొమాంటిక్ లవ్ స్టోరీతోనే హీరోగా వైష్ణవ్ తేజ్ పరిచయమయ్యాడు. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇక ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు తెరకి కేతిక శర్మ పరిచయమైంది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మరో లవ్ స్టోరీనే ‘రంగరంగ వైభవంగా’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు జోరుగా జరుగుతోంది.

    బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన స్వరపరిచిన ఒక పాటను ఫస్టు సింగిల్ గా వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 3వ తేదీన ఫస్టు సింగిల్ రిలీజ్ కానుంది. ‘తెలుసా .. తెలుసా’ అంటూ ఈ పాట కొనసాగనుంది.

    కేతిక శర్మకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇంతకుముందు ఆమె చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలోను ఆమె అంతకుమించి అన్నట్టుగా అందాలు ఆరబోయనుందనే టాక్ వినిపిస్తోంది.

  • గోదావరి, కృష్ణా సహా.. నదుల అనుసంధానానికి ప్రోత్సాహం

    కొరోనా కారణంగా మానసిక అనారోగ్యానికి గురైన వారి కోసం నాణ్యమైన మెంటల్‌ ‌హెల్త్ ‌కౌన్సిలింగ్‌, ‌సంరక్షణ సేవల కోసం టెలీ మెంటల్‌ ‌హెల్త్ ‌పోగ్రామ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్‌ ‌ప్రసంంలో నిర్మలా సీతారామన్‌ ‌తెలిపారు. జిల్‌, ‌పెట్రోల్‌ ‌వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ ‌వాహనాలను ప్రోత్సహిస్తామని, విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు, ప్రభుత్వ సంస్థల అనుసంధానం, ప్రైవేట్‌ ‌రంగంలో అడవుల పెంపకం కోసం పథకం తీసుకుని వచ్చారు. ఉత్తర సరిహద్దుల్లో గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం. బొగ్గు ద్వారా గ్యాస్‌ ఉత్పత్తి కోసం 4 పైలట్‌ ‌ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు.

    దేశ వ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.10.68 లక్షల కోట్లు. మూలధన పెట్టుబడుల కోసం రాష్టాల్రకు కేంద్ర సాయం. పట్టణ ప్రణాళిక కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. ఎల్‌ఐసీని పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ప్రైవేటీకరణ చేస్తామన్నారు. డ్రోన్ల సాయంతో పంట పొలాల పరీక్షలు. వ్యవసాయ యూనివర్శిటీల సిలబస్‌ ‌లో మార్పులు చేస్తామన్నారు. మన్‌ ‌గంగా  పీర్‌ ‌పంజాల్‌, ‌పర్‌ ‌తాపీ నర్మదా, గోదావరి కృష్ణా, కృష్ణా పెన్నా, పెన్నా-కావేరీ నదుల అనుసంధానానికి బడ్జెట్‌లో ప్రోత్సాహం దక్కింది, దీని వల్ల లబ్ది పొదే రాష్ట్రాల నుంచి అంగీకారం రాగానే నదుల అనుసంధానం ప్రయత్నాలను కేంద్రం ప్రారంభిస్తుందని, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేస్తామని ఆమె పేర్కొన్నారు.

  • ‌ప్రముఖ ఫొటో గ్రాఫర్‌ ‌భరత్‌ ‌భూషణ్‌ ‌కన్నుమూత

    సిఎం కెసిఆర్‌ ‌తదితరుల ప్రగాఢ సంతాపం
    ప్రముఖ ఫొటో గ్రాఫర్‌ ‌భరత్‌ ‌భూషణ్‌ ‌గుడిమల్ల ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో కన్నుమూశారు.  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భరత్‌ ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సామాజిక స్పృహ కలిగిన ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు. నల్లకుంటలోని ఆయన నివాసంలోకి వెళ్లగానే పల్లె అందాలు కట్టిపడేస్తాయి. ప్రతి ఫొటోకు క్యాప్షన్‌ అవసరం లేదని, ఫొటో చూడగానే భావాన్ని గుర్తించవచ్చు.

    భరత్‌ ‌మృతి పట్ల సిఎం కెసిఆర్‌, ‌మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ ‌రావు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 1970 ఫొటోగ్రాఫర్‌ ‌వృత్తిలోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఆ వృత్తిని జీవతంగా మలుచుకున్నారు. పలు ఇంగ్లీష్‌, ‌తెలుగు దినపత్రికలలో ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు. ఆయన మృతికి డియా అకడ ఛైర్మన్‌ అల్లం నారాయణ, జర్నలిస్ట్ ‌జాక్‌ అద్యక్షుడు దేవరకొండ కాళిదాస్‌, ‌కన్వీనర్‌ అవ్వారు రఘులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యలుకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

  • సుప్రీమ్‌ ‌కోర్టుకు దిశ ఎన్‌కౌంటర్‌ ‌నివేదిక

    57 మంది సాక్ష్యులను విచారించిన సిట్‌
    రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టిన సిర్పూర్కర్‌ ‌కమిషన్‌ ‌నివేదికను సుప్రీమ్‌ ‌కోర్టుకు సమర్పించింది. 47 రోజులపాటు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన కమిషన్‌.. ‌జనవరి 28న సుప్రీమ్‌కు నివేదిక అందించింది. ఈ కేసుకు సంబంధించి కమిషన్‌..అప్పటి సీపీ సజ్జనార్‌, ‌సిట్‌ ‌ఛైర్మన్‌ ‌మహేశ్‌ ‌భగవత్‌, ‌శంషాబాద్‌ ‌డీసీపీతో పాటు పలువురు పోలీసులు అధికారులు, ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను విచారించింది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు పోలీసులపై కాల్పులు జరపడం వల్ల ఎన్‌కౌంటర్‌ ‌చేసినట్లు అప్పటి సీపీ సజ్జనార్‌ ‌తెలిపారు.

    ఈ కేసుపై రాచకొండ సీపీ ఛైర్మన్‌గా సిట్‌ ‌కూడా ఏర్పాటైంది. అనంతరం 2019 డిసెంబర్‌ 12‌న సుప్రీమ్‌ ‌కోర్టు.. సిర్పూర్కర్‌ ‌కమిషన్‌ను నియమించింది. 2019 డిసెంబరు 6న… దిశ అత్యాచార నిందితులు నలుగురు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాయారు. ఆ ఎన్‌కౌంటర్‌ ‌జరిగిన విధానంపై నిజనిర్దారణ చేసేందుకు సిర్పూర్కర్‌ ‌కమిషన్‌ ‌క్షేత్రస్థాయిలో పర్యటించి..నిందితుల కుటుంబసభ్యులు, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులు సహా సంబంధిత అధికారులను విచారించింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ ‌నివేదికలు పరిశీలించింది. 57 మంది సాక్షులను విచారించినట్లు నివేదికలో పేర్కొంది.

  • ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలి

    బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయాలి
    దేశంలో 4 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి
    కేంద్ర సహకరిస్తే వేలాది మందికి ఉద్యోగావకాశాలు
    కేంద్రం తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌
    ‌డ్రిల్‌మెక్‌ ‌స్పా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం
    ఉభయ తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఏడున్నరేళ్లుగా కేంద్రం నుంచి సహాయ, సహకారాలు లేవని తెలిపారు. ఈసారి బ్జడెట్‌లోనైనా విభజన హాలు అమలు చేయాలని, తెలంగాణలో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని కేటీఆర్‌ ‌కోరారు. దేశంలో 4 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తెలిపారు. కేంద్రం సహకరిస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు వొస్తాయని తెలిపారు. సోమవారం ఆయన డియాతో మాట్లాడుతూ..రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరమన్నారు. తమ హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని కేటీఆర్‌ ‌ప్రకటించారు.

    రాష్ట్రం ప్రగతి పథాన దూసుకుపోతున్నా…కేంద్రం నుంచి సహకారం మాత్రం దక్కడం లేదని కేటీఆర్‌ ‌విమర్శించారు. హైదరాబాద్‌లో డ్రిల్‌మెక్‌ ‌స్పా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకున్న కార్యక్రమంలో… మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థలు తరలిరావడం…..సీఎం కేసీఆర్‌ అద్భుత పాలనకు నిదర్శనమని కేటీఆర్‌ ‌వ్యాఖ్యానించారు. ‘ఏడున్నరేళ్లుగా సహకారం లేదు..ఈసారైనా విభజన హాలు అమలు చేయాలన్నారు. హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థకు చెందిన తయారీ యూనిట్‌ ‌ప్రారంభం కాబోతుంది. ఆయిల్‌ ‌డ్రిల్లింగ్‌, ‌రిగ్‌ ‌సెక్టార్‌లో ప్రపంచస్థాయి కంపెనీగా వెలుగొందుతున్న… డ్రిల్‌ ‌మెక్‌స్పా …. రాష్ట్రంలో రూ.15వందల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో రిగ్గుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇవాళ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది.

    ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ఉపాధి దక్కుతుందన్న కేటీఆర్‌….80‌శాతం వరకు స్థానికులకే కొలువులు దక్కేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ప్రపంచ దేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలను కాదని…హైదరాబాద్‌లో డ్రిల్‌మెక్‌ ‌స్పా సంస్థ తమ యూనిట్‌ ఏర్పాటు చేయడం… రాష్ట్ర ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇటలీ, యూఎస్‌ ‌వంటి దేశాలను కాదని భారత్‌లో పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకోవడం…అందులోనూ దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందినా హైదరాబాద్‌నే ఎంచుకోవడం…ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనమని కేటీఆర్‌ అన్నారు. దేశంలో నాలుగో అతిపెద్ద ఎకాన కంట్రిబ్యూటర్‌గా తెలంగాణ అభివృద్ధి పథాన దూసుకుపోతున్నా…. కేంద్రం నుంచి సహకారం కరవైందని కేటీఆర్‌ ఆక్షేపించారు. బడ్జెట్‌ ‌ప్రవేశపెడుతున్న దృష్ట్యా….హాలు నిలబెట్టుకోవాలని ప్రధాని, ఆర్థికమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ పదేపదే సబ్‌ ‌కా సాత్‌ ‌సబ్‌ ‌కా వికాస్‌ అం‌టున్నారని… రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు. కేవలం నినాదంతో మేకిన్‌ ఇం‌డియా సాకారం కాదు.

    అందుకు తగిన సంస్కరణలు, విధానాలు, మౌలికవసతులు తీసుకురావాలి. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ ‌పార్క్‌గా దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ ‌పార్క్‌కు శ్రీకారం చుట్టాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌.. ‌హైదరాబాద్‌ ‌ఫార్మాసిటీ ఏర్పాటుచేయబోతున్నాం. కేంద్రం నుంచి వీటికి సాయం కోరినా స్పందన లేదు. 6 కొత్త ఇండస్ట్రియల్‌ ‌కారిడార్లు ఏర్పాటుచేయాలని కోరాం. అది కూడా కార్యరూపం దాల్చలేదు. సైద్దాంతిక, రాజకీయ విభేదాల కారణంగా రాష్ట్రంపై వివక్ష చూపితే సంక్షోభం తలెత్తుతుంది. దేశంలో పారిశ్రామికీకరణకు, ఉద్యోగ కల్పనకు, ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌సంకల్పానికి విఘాతం కలుగుతుందని కెటిఆర్‌ అన్నారు. ఆయిల్‌, ‌నేచురల్‌ ‌గ్యాస్‌ ‌వెలికితీసే మెషినరీ తయారు చేయడంలో డ్రిలింగ్‌ ‌స్పా కంపెనీకి వందేళ్లకు పైగా అనుభవం ఉంది.ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 2,500ల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ ‌ట్విటర్‌ ‌వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు డ్రిల్‌మెక్‌స్పా సంస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

  • రాష్ట్రపతి ప్రసంగాన్ని టిఆర్‌ఎస్‌ ‌బహిష్కరణ

    పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాల తొలి రోజు నుంచే టీఆర్‌ఎస్‌ ‌నిరసనలు మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్‌ ‌నిర్దేశం మేరకు పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు బహిష్కరించారు. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి ఎంపీలు దూరంగా ఉన్నారు. సాయంత్రానికి గులాబీ పార్టీ ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. విభజన హాలు, ఆర్థిక సంఘం సిఫారసులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ ‌నిధులు, జీఎస్టీ నిధులు సహా 23 అంశాలపై పోరాడాలని ఎంపీలకు సీఎం కేసీఆర్‌ ‌దిశానిర్దేశం చేశారు.

    బడ్జెట్‌లో తెలంగాణకు సరైన కేటాయింపులు లేకపోతే పార్లమెంట్‌లో నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలపై పార్లమెంటు లోపలా బయటా పోరాడాలని టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం కేంద్రంపై టీఆర్‌ఎస్‌ ‌తీవ్ర ఒత్తిడి తీసుకురానుంది.

  • ఊరుకోము.. ఐసిస్ ను వేటాడుతాం: బైడెన్

    వాషింగ్టన్: అమెరికా భద్రతా బలగాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని కాబూల్ లో ఐసిస్ ఖొరసాన్ కె గ్రూపు చేసిన దారుణ మారణకాండ పై అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ విచారం వ్యక్తం చేశారు.

    కాబూల్ ఏయిర్ పోర్టులో జంట పేలుళ్లపై బైడెన్ భావోద్యేగంగా ప్రసంగించారు. ఈ బాంబు దాడిలో 60 మందికి పైగా చనిపోగా, 150 మంది క్షతగాత్రులు అయ్యారు. బాంబు దాడి ఘటనలో 13 మంది అమెరికా సైనికులు చనిపోగా, మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వైట్ హౌస్ లో మీడియాతో బైడెన్ మాట్లాడుతూ, ఈ ఘటనకు బాధ్యులెవరు అయినా క్షమించే ప్రసక్తి లేదు, వాళ్లెవరు అయినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ దాడిని అంత తేలికగా మేము మర్చిపోం, ఉగ్రవాదం గెలిచినట్లు కాదన్నారు. ఐసిస్ నాయకుల ఏరివేత ఇక మొదలైందని, వెంటపడి వేటాడి ప్రతికారం తీర్చుకుంటామని ఆయన శపథం చేశారు. బాంబు దాడిలో మృతిచెందిన వారికి సంఘీభావంగా బైడెన్ కొద్దిసేపు మౌనం పాటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 31వ తేదీలోపు ఆఫ్ఘన్ నుంచి అమెరికా సైనిక బలగాలు, పౌరుల తరలింపును పూర్తి చేస్తామని బైడెన్ అన్నారు.

  • డ్రగ్స్ కేసు… సినీ స్టార్స్ కు ఈడి నోటీసులు?

    హైదరాబాద్: డ్రగ్స్ కేసు మళ్లీ తెరమీదికి వచ్చింది. ఈసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) రంగంలోకి దిగింది. ఈ కేసులో సంబంధం ఉన్న నటీనటులకు సమన్లు జారీ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.

    ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. సమన్లు అందుకున్నవారిలో రవితేజ, దగ్గుబాటి రానా, తరుణ్, నవదీప్, తనీష్, దర్శకుడు పూరి జగన్నాథ్, హీరోయిన్లు ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. సెప్టెంబర్ 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న దగ్గుబాటి రానా, 9న రవితేజ, నవంబర్ 15న మమైత్ ఖాన్ విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించింది. పూర్తి ఆధారాలతో రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నది. నాలుగు సంవత్సరాల క్రితం డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు 67 మంది అనుమానితులను తెలంగాణ ఎక్సైజ్ విభాగం విచారణ జరిపింది. వీరిపై ఛార్జిషీట్లు దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు మరుగున పడి ఉంది. పూర్తి విచారణ కోసం ఈడి రంగంలోకి దిగడంతో టాలీవుడ్ లో కలకలం మొదలైంది.

  • బ్రోకర్ రాలేదు… పాల మల్లిగాడు రాలేదు!: రేవంత్ రెడ్డి

    మేడ్చల్: సిఎం కెసిఆర్ దత్తత గ్రామాలను దగా చేశారని, ఏ ఒక్క హామీని అమలు చేసినా ముక్కు నేలకు రాసి ఎంపి పదవికి రాజీనామా చేస్తానని నిన్న సవాల్ చేశాను, 24 గంటలు దాటినా ఒక్కడు రాలేదన్నారు.

    మూడుచింతలపల్లిలో టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, మంత్రి సి.మల్లారెడ్డిపై విరుచుకుపడ్డారు. దత్తత గ్రామాల్లో ఒక్క హామీని అమలు చేసినా ముక్కును నేలకు రాస్తానని చెప్పినా ఒక్కడు స్పందించలేదన్నారు. పాలు అమ్మే మంత్రి మల్లారెడ్డి రాలేదు. నీళ్లు అమ్మేవాడు రాలేదు. భూములు కబ్జాలు చేసేవాళ్లు కూడా జాడ లేదన్నారు. జోకర్ మల్లన్న కూడా కన్పించడం లేదన్నారు. ఈ మల్లిగాడు వేదిక ఎక్కితే జోకర్ మాదిరి, వేదిక దిగగానే భూముల బ్రోకర్ లాగా మాట్లాడుతాడని అన్నాడు. తన నియోజకవర్గంలో ఎవరు భూములు కొనుగోలు చేసినా పాల మల్లిగాడికి కమిషన్ ఇవ్వాల్సిందేనన్నారు. తనకు సిఎం కావాలనే ఆశ లేదని, ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

    mduchinthapally village

  • సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బదిలీ

    హైదరాబాద్: సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఆర్టిసి) మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    సజ్జనార్ (1996) స్థానంలో స్టిఫెన్ రవీంద్రను (1999) కొత్త పోలీస్ కమిషనర్ గా నియమించింది. మూడు సంవత్సరాల క్రితం సజ్జనార్ ను సైబరాబాద్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది. దిశా నిందితుల ఎన్‌కౌంటర్ తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. అంతకు ముందు వరంగల్ లో యువతిపై యాసిడ్ దాడి నిందితుడి ఎన్‌కౌంటర్ తో గుర్తింపు పొందారు. దిశా ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు ప్రత్యేక కమిషన్ ను నియమించింది. బాధితులు, సాక్షుల విచారణ కొనసాగుతున్నది.