జర్నలిస్టుల పక్షపాతి టియుడబ్ల్యూజే (ఐజేయు)
• జర్నలిస్టులకు కార్పొరేట్ వైద్యం అందించాలి …
• సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు గౌడ్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 17: జర్నలిస్టుల పక్షపాతిగా, వారి సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పనిచేసే సంఘం టియుడబ్ల్యూజే (ఐజేయు) అని ఆ సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ సర్వ సభ్య సమావేశం, నూతన కమిటీ ఎన్నికలు గురువారం సూరారం లోని వీఐపీ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనకు దిగుతామని, వర్కింగ్ జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు అందించాలంటూ వారు డిమాండ్ చేశారు.

• నూతన కమిటీ ఎన్నిక…
అనంతరం కుత్బుల్లాపూర్ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోలిపల్లి దయాకర్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సాయిబాబా, ఉపాధ్యక్షులుగా సీతారామరావు, కలికిమూర్తి యర్రంశెట్టి, శ్రీధర్, సురేష్, ప్రధాన కార్యదర్శిగా రెడ్డెబోయిన మల్లేష్ యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బేరోజు రణదేవ్, శేషారెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాస్, ప్రవీణ్, ఎల్లంపల్లి నర్సింహులు, అన్వర్, కోశాధికారిగా శివ శర్మ,
కార్యవర్గ సభ్యులుగా లక్ష్మణ్, సంతోష్, ఎండి లియాకత్ అలీ, నాగబాబు, గ్రంధాలు, నవీన్ రాజు, సంతోష్,
సలహాదారులుగా శేఖర్ గుంటూరు, గౌస్ మొయినుద్దీన్, నాగేంద్ర చారి, కె. వెంకట్, లాలయ్య, సిరిగిరి శ్రీనివాస్, కుంట అనిల్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాయిబాబా, కోశాధికారి శేషారెడ్డి, మాజీ అధ్యక్షులు శేఖర్, వెంకట్, సిరిగిరి శ్రీనివాస్, నాగేంద్ర చారి, సీనియర్ జర్నలిస్టులు రామారావు, అనిల్, గౌస్, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.