దుండిగల్ పోలీస్ స్టేషన్లో నూతన సౌకర్యాల ప్రారంభం
• ముఖ్యఅతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ డిసిపి కోటిరెడ్డి
దుండిగల్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 9 : దుండిగల్ పోలీసు స్టేషన్లో కీలక అభివృద్ధి నూతన సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ డివిజన్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి హాజరై, స్టేషన్లో కొత్తగా నిర్మించిన వాటిని గురువారం ప్రారంభించారు. ఈ మేరకు స్టేషన్లో జప్తు చేసిన కేసు సంబంధిత ఆస్తులను సురక్షితంగా భద్రపరిచే విధంగా నిర్మించిన మాల్కానా గది , కోర్టు కేసులకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలు, రికార్డులను క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన కోర్టు రికార్డు గది, అలాగే విధుల్లో ఉన్న సిబ్బంది పనితీరును మెరుగుపరచడానికి రూపొందించిన ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ వర్క్ స్టేషన్లు ను డీసీపీ ప్రారంభించారు.

అనంతరం డీసీపీ, ఏసీపీ శంకర్ రెడ్డి, ఎస్ హెచ్ వో సతీష్ తో కలిసి కోర్టు రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణలో పారదర్శకత, క్రమబద్ధత, భద్రతను పెంపొందించడానికి తగిన సూచనలు అందించారు. ముఖ్యంగా కేసులకు సంబంధించిన పత్రాలు సమయానికి నవీకరించడం చేయడం, డిజిటల్ రికార్డింగ్‌పై దృష్టి సారించడం, రికార్డుల సంరక్షణలో జాగ్రత్తలు పాటించడం వంటి అంశాలపై డిసిపి దిశానిర్దేశం చేశారు. నూతన సౌకర్యాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు దోహతపడతాయని సిబ్బంది అభిప్రాయపడ్డారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు పోలీస్ స్టేషన్ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్ళు, సిబ్బంది పాల్గొన్నారు.