పేట్‌బషీరాబాద్‌లో వాటర్‌ ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 1 :  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పరేడ్ కోసం హాజరైన ఏఎస్ఐ ఆర్‌.దివిసింగ్ (60) దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురై శనివారం మృతిచెందారు. వివరాల ప్రకారం..పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం పరేడ్ కార్యక్రమానికి హాజరైన ఆర్‌.దివిసింగ్ ఆరోగ్య సమస్యల కారణంగా పరేడ్‌లో పాల్గొనకుండా పక్కన నిలబడి ఉన్నారు.

ఈ క్రమంలో గ్రౌండ్ సమీపంలోని రోడ్డుపై నడుస్తుండగా, ఆ సమయంలో గ్రౌండ్ లోపల నుంచి యూ-టర్న్ తీసుకుంటున్న ఐచర్ వాటర్ ట్యాంకర్ లారీ వెనుక భాగం ఏఎస్ఐ దివిసింగ్‌ను బలంగా తాకింది. దాంతో తీవ్రంగా గాయపడ్డ ఆయనను సహచరులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తూ ఏఎస్ఐ మృతి చెందారు. ఈ ఘటనపై పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More