ముగిసిన బంద్… కదిలిన బస్సులు..

• జీడిమెట్ల డిపో నుంచి బయలుదేరిన విజయవాడ బస్సు 

• కుత్బుల్లాపూర్ లో మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ముగిసిన బంద్

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 18: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌ ముగిసిన నేపథ్యంలో నగర రవాణా వ్యవస్థ మళ్లీ పునరుద్ధరించబడింది. ఉదయం నుంచి బంద్‌ ప్రభావంతో రోడ్లపైకి రాలేకపోయిన ఆర్టీసీ బస్సులు, మధ్యాహ్నానికి ఒక్కొక్కటిగా రోడ్లపైకి దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

రోడ్డు ఎక్కిన బస్సు

బీసీ రిజర్వేషన్ నేపథ్యంలో నిర్వహించిన రాష్ట్ర బంద్ కుత్బుల్లాపూర్ లో మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ముగిసింది. దీంతో మధ్యాహ్నం నుంచి బంద్ సడలించడంతో జీడిమెట్ల బస్ డిపో నుంచి విజయవాడకు వెళ్లవలసిన బస్సు బయలుదేరింది. సిటీ బస్సులను కూడా త్వరలోనే మార్గాల వారీగా బస్సులను బయటికి పంపడానికి సిద్ధమవుతున్నారు.

జీడిమెట్ల డిపోలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న సిటీ బస్సులు

డిపో నుంచి బస్సులు బయటికి వస్తున్నాయి అన్న సమాచారం అందుకున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బందులో నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా జరిగేలా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More