వడ్డెర సమాజం బలోపేతానికి పాటుపడతాం
• సంఘం కుత్బుల్లాపూర్ అధ్యక్షుడిగా దండుగుల స్వామి
• సోషల్ మీడియా ఇన్ చార్జిగా పీట్ల శివకుమార్ నియామకం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 8: కుత్బుల్లాపూర్ వడ్డెర సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. సమాజ ఐక్యతను కాపాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలనే ఉద్దేశంతో సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దండుగుల స్వామిని వడ్డెర సంఘం కుత్బుల్లాపూర్ అధ్యక్షుడిగా, పీట్ల శివకుమార్‌ను సోషల్ మీడియా ఇన్ చార్జీగా నియమిస్తూ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ అధికారికంగా ప్రకటించారు. జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ మాట్లాడుతూ… వడ్డెర సమాజం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం పొందాలంటే యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ పరిధిలో దండుగుల స్వామి, పీట్ల శివకుమార్ లాంటి చురుకైన నాయకులు బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. వీరి నాయకత్వంలో వడ్డెర సమాజం మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సమాజ అభివృద్ధి, సామాజిక న్యాయం, రాజకీయ భాగస్వామ్యం కోసం వడ్డెర సంఘం కృషి చేస్తున్న తరుణంలో ఈ నియామకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయన్నారు. కుత్బుల్లాపూర్ పరిధిలో వడ్డెర సమాజమంతా ఏకతాటిపై ముందుకు సాగుతూ, తమ ఉనికిని రాష్ట్ర రాజకీయల్లో పదిలం చేసుకోవాలన్నారు.

అనంతరం బాధ్యతలు స్వీకరించిన దండుగుల స్వామి మాట్లాడుతూ…వడ్డెర సమాజానికి గౌరవం, ఆత్మగౌరవం మెరుగుపడేలా కృషి చేస్తానని, సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరిని సమన్వయపరిచి ముందుకు సాగుతానన్నారు. ఈ బాధ్యతను నాకు నమ్మకంతో అప్పగించిన జాతీయ అధ్యక్షులు పీట్ల శ్రీధర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. సోషల్ మీడియా ఇంచార్జిగా నియమితులైన పీట్ల శివకుమార్ మాట్లాడుతూ …వడ్డెర సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తేవడమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా సమాజ ఐక్యతను పెంపొందించడమే తన లక్ష్యమని, వడ్డెర యువతలో అవగాహన, చైతన్యం పెంపొందించే దిశగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతామని తెలిపారు. వడ్డెర సంఘం నాయకులు, యువత సంఘం సభ్యులు దండుగుల స్వామి, పీట్ల శివకుమార్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.