స్వచ్ఛ సర్వేక్షణ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి.- డిసి నర్సింహ
పేట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), జనవరి 17:
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై జీడిమెట్ల సర్కిల్ ను పరిశుభ్రమైన సర్కిల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఉప కమిషనర్ వి. నర్సింహ అన్నారు. జీడిమెట్ల సర్కిల్లోని పేట్ బషీరాబాద్ డివిజన్ పరిధి గంగా ఎన్‌క్లేవ్ లోని పంచతత్వ పార్క్ లో స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్ డబ్ల్యు ఏ) సభ్యులు, సీనియర్ సిటిజన్లతో కలిసి డిసి స్వచ్ఛతపై శుక్రవారం ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు. అక్కడే సమీపంలోని ఎన్సీఎల్ ఎన్ క్లేవ్ లో ఉన్న జీవీపీ (గార్బేజ్ వలనరబుల్ పాయింట్)ను తొలగించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, చెత్తను వేరు చేసి సేకరించడం, చెత్తను ఇష్టానుసారం ఎక్కడపడితే అక్కడ పడవ వేయకుండా స్వచ్ఛ ఆటోల వారికి అందించడం ద్వారా స్వచ్ఛమైన నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య జవాన్ జిలాని, సానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎస్ ఎఫ్ ఏ లు), పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.