హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుండాలి. – రాధా మనోహర్ దాస్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 8: హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తున్న ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇవ్వాలని, ఆర్థికంగా బలోపేతం చేయడం, సంఘటితంగా ముందుకు సాగడం ద్వారానే సనాతన ధర్మాన్ని కాపాడుకోగలమని, అందరూ ధర్మ పరిరక్షణ యజ్ఞంలో భాగస్వాములు కావాలని సనాతన ధర్మ పరిరక్షణ గురువు రాధా మోహన్ దాస్ పిలుపునిచ్చారు. హిందూ సనాతన ధర్మ పరిరక్షణకై నిరంతరం పాటుపడుతున్న ఆయన నగరానికి వచ్చిన సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాధా మోహన్ దాస్ ను బిజెపి నిజాంపేట అధ్యక్షుడు బిక్షపతి యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ…ఇస్కాన్ ప్రచార కార్యకర్తగా ఉన్నప్పటి నుంచే ఆయన శ్రీకృష్ణ ధర్మ ప్రసంగాలను వింటూ, వారి ఆలోచనలను అనుసరిస్తున్నానన్నారు. నేటి కాలంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో హిందూ దేవాలయాలు, సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను ఆయన ధైర్యంగా ప్రశ్నిస్తూ, సనాతన ధర్మ గొప్పతనాన్ని నిర్విరామంగా చాటుతున్నారన్నారు. ఆయనతో కలిసి పూజలో పాల్గొని, వివిధ ధార్మిక అంశాలపై చర్చించే అవకాశం దొరకడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ సనాతన ధర్మ కల్చరల్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ గుప్తా, సచిన్ తదితరులు పాల్గొన్నారు.