పేట్ బషీరాబాద్ క్రైమ్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 22: గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 55 సంవత్సరాల వయసు గల ఒక వ్యక్తి పీఎస్ఆర్ కన్వెన్షన్ వద్ద రోడ్డు పక్కన పడి ఉన్నాడని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. అప్పటికే ఆ వ్యక్తి మరణించాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు చనిపోయిన వ్యక్తి పేట్ బషీరాబాద్ పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ రోడ్డు పక్కనే జీవనం సాగించేవాడని, ఫుట్ పాత్ పై పడుకునేవాడని తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తి పసుపు రంగు టీ షర్టు, ఆరెంజ్ కలర్ లుంగీ ధరించాడని ఎవరికైనా ఆచూకీ తెలిస్తే క్రింది నెంబర్లకు 8712568129, 8790477718 సంప్రదించాలని తెలిపారు.
Sign in / Join
Sign in
Recover your password.
A password will be e-mailed to you.