• ప్రశంసా పత్రాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
• ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రధానం
భువనగిరి (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 8: ప్రజల ఆరోగ్య సేవలో అంకితభావంతో ముందంజలో నిలిచిన వైద్యాధికారికి జిల్లా స్థాయిలో గౌరవం, కలెక్టర్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక ప్రశంసా పురస్కారం దక్కింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన యాదాద్రి భువనగిరి జిల్లాలోని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వేణుమాధవికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి చేతుల మీదుగా “ఉత్తమ వైద్యాధికారి” ప్రశంసా పత్రం అందజేశారు.
ఈ మేరకు ప్రభుత్వ వైద్యాధికారులు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కలెక్టర్ అభినందించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేసేందుకు వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. అనంతరం డాక్టర్ వేణుమాధవి మాట్లాడుతూ…ఈ గౌరవం ఆమె బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ గౌరవం దక్కడానికి సహకరించిన వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం ఆరోగ్య కేంద్రంలోని ప్రతి ఒకరికి చెందుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.