కుత్బుల్లాపూర్ కూడలి బస్‌స్టాప్ వద్ద వ్యక్తి మృతి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 7: చింతల్ ప్రధాన రహదారి కుత్బుల్లాపూర్ కూడలి బస్‌స్టాప్ వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తి భిక్షాటన చేస్తూ తరచుగా అదే బస్‌స్టాప్ పరిసరాల్లో కనిపించేవాడని తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 నుండి 50 సంవత్సరాల మధ్యగా ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలను గుర్తించే ప్రయత్నాలను పోలీసులు కొనసాగిస్తున్నారు.