ఘనంగా శ్రీ శుభానంద దేవి సమేత ముక్తేశ్వర ఆలయంలో కోటి దీపోత్సవం
• భోళా శంకరుడి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి – ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 20: శ్రీ ముక్తేశ్వర స్వామి దయతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆకాంక్షించారు. కుత్బుల్లాపూర్ డివిజన్ బాపు నగర్ లోని శ్రీ శుభానంద దేవి సమేత ముక్తేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా గురువారం హాజరయ్యారు.

ఈ మేరకు ముక్తేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు సుబ్బా రావు, ప్రధాన కార్యదర్శి దయానంద్, సభ్యులు సందీప్, సుకుమార్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్, ఎలక్ట్రికల్ శ్రీనివాస్, బాబు రావు, సత్యనారాయణ, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ యాదవ్, కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, పెంటయ్య, డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, సీనియర్ నాయకులు కిషోర్ చారి, రమణా రెడ్డి, దేవేందర్, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.