ఘనంగా గాజులరామారం పద్మశాలి కార్తీకమాస వనభోజన మహెూత్సవం
• పద్మశాలి కార్తీకమాస వనభోజన మహెూత్సవంలో పాల్గొన్న కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 19: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని గాజులరామారం డివిజన్ లో జరిగిన పద్మశాలి కార్తీకమాస వనభోజన మహోత్సవం నకు సూరారం కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజర య్యారు. ఈ సందర్భంగా వారికి నిర్వాహకులు స్వాగతం పలికారు. కార్యక్రమ నిర్వాహకులు, ప్రజలు వారిని సాదరంగా ఆహ్వానించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం నిర్వాహకులు శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందించారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ, పూర్వీకులు మన ప్రయోజనాలను కోరి అనేక ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరిచారని, సామూహిక జీవన విధానాన్ని అలవాటు చేసే వన భోజన కార్యక్రమం అలాంటిదేనని అన్నారు. వన భోజనాలకు వచ్చిన వారికి పేరుపేరునా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజుల్లో ప్రజలు ఆధ్యాత్మిక, సామాజిక ప్రయోజ నాలను ఆశించి వన భోజనాలు జరుపు కునేవారని అన్నారు. కానీ కాల క్రమంలో కులాల వారీగా వన భోజనాలు జరుపు కునే ఆచారం వచ్చిందని తెలిపారు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరూ సహకరించుకుంటూ పోతే ప్రజల మధ్య సహృద్భావ సంబంధాలు పెంపొంది వసుదైక కుటుంబంగా వర్ధిల్లుతాతమనీ, సత్సంబంధాలు పెరిగి ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడుతుందని స్పష్టం చేశారు. వన భోజనాలతో ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరిగి, వైవాహిక సంభందాలతో కుటుంబ బంధాలు మరింత బలపడతాయని మంత్రి సత్యనారాయణ అన్నారు. వన భోజనాలను నిర్వహించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షులరాలు గుంటుక రూప, పద్మశాలి సంఘం మహిళా పట్టణ అధ్యక్షురాలు పరండ్ల శారదా, పద్మశాలి సంఘం యూత్ రాష్ట్ర అధ్యక్షులు గుండేటి శ్రీధర్, గాజులరామారం పద్మశాలి సంఘం నాయకులు సాయినాథ్ నేత, కస్తూరి బాలరాజు, తెలంగాణ సాయి, సినీయర్ జర్నలిస్ట్ లు ఈనాడు శ్రీనివాస్, టి రమేష్, బూరెలా ముకేశ్, దూలప్ప, శ్రీదేవి నాగభూషణం, పాండు, జి రాజశేఖర్,టాక్స్ శ్రీనివాస్, గోసిక్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.