చింతల్ సర్కిల్లో ఏసీబీ సోదాలు
• టాక్స్ ఇన్స్పెక్టర్ వాహిద్ ను విచారిస్తున్న
• పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 17: జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ జోన్ పరిధి చింతల్ సర్కిల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. చింతల్ సర్కిల్లో టాక్స్ ఇన్స్పెక్టర్ (టి ఐ) గా విధులు నిర్వహిస్తున్న వాహిద్ ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ అధికారులకు అందిన సమాచారం మేరకు వాహిద్ జేబులో ఉన్న అధిక మొత్తం నగదు ఆధారంగా వారు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ విచారణ కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కొనసాగుతుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.