తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన వైశ్య లయన్స్ సభ్యులు
జగద్గిరిగుట్ట (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 24: ఆర్య వైశ్యుల కులదైవం శ్రీ వాసవి మాత జయంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు వైశ్య లయన్స్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగద్గిరిగుట్టలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సంతోషకరమని సభ్యులు తెలిపారు. సమాజంలో ఐక్యత, ధర్మం, అహింసా సిద్ధాంతాలను ప్రచారం చేసిన వాసవి మాత ఆశయాలను స్మరించుకునే ఈ నిర్ణయం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా వాసవి మాత ఆశయాలు మరింతగా ప్రజల్లోకి చేరి, సమాజంలో సౌభ్రాతృత్వం, శాంతి స్థాపనకు దోహదపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వాసవి మాత ఆశీస్సులతో రాష్ట్రం సర్వాంగసుందరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధీర్ మంకాల, దారం ఇంద్రసేన గుప్త, బండారు వరప్రసాద్ గుప్త, గోలి రమేష్ గుప్త, పోల రమేష్ గుప్త, నాంపల్లి విజయ్ గుప్త, నందు గుప్త, వాసవి దేవాలయం మాజీ చైర్మన్ ప్రవీణ్ గుప్త తదితరులు పాల్గొన్నారు.