ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో మెగా వైద్య శిబిరాలు
• జీడిమెట్ల, గాజులరామారం సర్కిల్లో నిర్వహించిన అధికారులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఏప్రిల్ 8: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో 33వ రోజు సందర్భంగా, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గాజులరామారం, జీడిమెట్ల సర్కిళ్లలో మెగా హెల్త్ క్యాంప్‌లు విజయవంతంగా మంగళవారం నిర్వహించారు.
🔹 గాజులరామారం సర్కిల్ లో….
గాజులరామారం సర్కిల్ పరిధిలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో పారిశుధ్య కార్మికులు, ఎంటమాలజీ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన ఈ హెల్త్ క్యాంప్‌లో మొత్తం 141 మందికి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.

🔹 జీడిమెట్ల సర్కిల్ లో…
జీడిమెట్ల సర్కిల్ పరిధిలో కూడా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో పారిశుధ్య కార్మికులు, ఎంటమాలజీ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 230 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ ఆరోగ్య శిబిరాల ద్వారా కార్మికుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు. ఈ కార్యక్రమాల్లో ఉప కమిషనర్లు శ్రీపాద రామేశ్వర్, శంకర్ సింగ్, ఏఎంసీ సుజాత, ఏ ఎమ్ వో హెచ్ కవిత, వైద్యులు, పారిశుద్ధ్య జవాన్లు జిలాని, చందర్, ఎస్ఎఫ్ఏలు, సిబ్బంది పాల్గొన్నారు.