బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారికి జరిమానాలు
• కుత్బుల్లాపూర్ గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన పారిశుద్ధ్య సిబ్బంది
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 18: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో చెత్తవేసే వారిపై జిహెచ్ఎంసి సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పర్యవేక్షణలో పట్టుబడిన పలువురిపై జిహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బంది జరిమానాలు విధించింది. చెత్తను నిర్ణీత డంపింగ్ పాయింట్లలో వేయకుండా బహిరంగ ప్రదేశాల్లో పారేస్తూ పర్యావరణాన్ని కాలుష్యం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వారు హెచ్చరించారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ ప్రధాన రహదారి, మహేందర్ నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీతోపాటు పలు ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాలు, నిర్మానుష్య ప్రాంతాలు, నాలాలు, రహదారుల పక్కన చెత్త వేస్తున్న వారిని గుర్తించి వారికి జరిమానాలు విధించి అవగాహన కల్పి స్తున్నారు.
పౌరులు పరిశుభ్రత పట్ల బాధ్యతతో వ్యవహరించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం చట్టపరమైన నేరమని తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో పారిశుధ్య జవాన్ జిలాని, సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ శివ కుమార్, రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు.